HEALTH & LIFESTYLE

అలర్ట్: ఉద్యోగులకు బర్న్‌అవుట్ సిండ్రోమ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇప్పుడు ‘బర్న్‌అవుట్ సిండ్రోమ్‌’ అనేది ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత వంటి కారణాల వల్ల వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పని జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఏడుగురు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తేలింది. బర్నవుట్ సిండ్రోమ్‌కు గురైన ఉద్యోగులు శారీరక, మానసిక అలసటతో పాటు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో వారి భావోద్వేగాలు అదుపులో ఉండవు. 

ఈ సిండ్రోమ్ లక్షణాలను చూస్తే.. శారీరకంగా బలహీనంగా ఉండటం. చేసే పనిపై ఆసక్తి కోల్పోవడం, ఎప్పుడూ ఆందోళనతో ఉండటం, చిన్న విషయాలకే చిరాకు పడటం, సమయానికి నిద్ర పట్టకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండటం, నిరుత్సాహంతో ఉండటం వంటివి.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి వైద్యులు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే సూర్యోదయం చూడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏకధాటిగా పని చేయకుండా చిన్న చిన్న విరామాలు తీసుకుని నడవాలి. మొబైల్‌ ఫోన్‌లో కాలక్షేపం చేయకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా బర్న్‌అవుట్ సిండ్రోమ్‌ను అధిగమించవచ్చు.

Show More
Back to top button