HEALTH & LIFESTYLE

చిరుధాన్యాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

భారత్‌లో ఒకప్పటి సగటు జీవిత కాలంతో పోల్చితే ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు పెరిగినప్పటికీ జీవన ప్రమాణ స్థాయి తగ్గుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆహార విధానంలో మార్పు రావడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడంటే బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. కానీ, పూర్వం చిరుధాన్యాలే ఆహారంగా తీసుకునే వారు.

వీటి దిగుబడి తక్కువగా ఉండేది. జనాభా పెరగడంతో అందరూ ఎక్కువగా అన్నం తినడానికి అలవాటు పడ్డారు. చిరుధాన్యాల్లో జీవక్రియలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ, అన్నంలో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, అలసందలు, అరికెలు, సామల్లో గొప్ప పోషక విలువలున్నాయి. ఈక్రమంలోనే వాటిని తినడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని చిరు ధాన్యాల గురించి తెలుసుకుందాం. 

కొర్రలు

100 గ్రాముల కొర్రల్లో పోషక విలువలు ఇలా..

331 కాలరీస్

12.3 గ్రాముల ప్రోటీన్

62 గ్రాముల కార్బోహైడ్రాట్స్

12 గ్రాముల మాంసకృత్తులు

8 గ్రాముల పీచు పదార్థాలు

2. 5 గ్రాముల కొవ్వు పదార్థాలు

కొర్రలు ఆకలిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతాయి. కొర్రలు బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ ఆకలిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు నివారిస్తుంది. కొర్రల్లో ఉండే లైసితిన్, మిత్‌‌ఫిన్ వల్ల శరీరంలో కొవ్వు తగ్గే అవకాశం ఉంది. కొర్రల్లో థోరిన్ అనే కెమికల్ ఉండడంతో కాలేయం చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. కొర్రలు గ్లూటెన్ ఫ్రీ ఆహారం ప్రేగుల పొరలకు ఎలాంటి హాని చేయదు. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగటానికి సహకరిస్తుంది. కొర్రల్లో ఉండే అధిక ఫైబర్ గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలోకి కలిసేటట్లు చేసి షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది. పిల్ల‌లు, గ‌ర్భిణుల‌కు, వృద్ధుల‌కు, అత్య‌ధిక శారీర‌క శ్ర‌మ చేసే వారు ఆహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

రాగులు

100 గ్రాముల రాగుల్లో పోషక విలువలు ఇలా

7.3 గ్రాముల ప్రోటీన్

344 గ్రాముల కాల్షియం

1.6 గ్రాముల ఫైబర్

7.30 గ్రాముల ప్రోటీన్

రాగులు తినడం ద్వారా కొలెస్ట్రాల్, బీపీని తగ్గించుకోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలను బలంగా మార్చడంతో పాటు ఎముకలకు వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే రక్తహీనతను నివారించవచ్చు. రాగుల్లో ఫైబర్ కూడా ఉంటుంది. రాగులు తింటే చాలా సేపు నిండినట్లే ఉంటుంది. ఆకలి వేయదు. ఈ కారణంగా అతిగా తిండికి చెక్ పడుతుంది. రాగుల వల్ల శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అందుకే బరువు తగ్గడానికి రాగులు ఉత్తమం అని నిపుణులు చెబుతారు. డయాబెటిక్ బాధితులు అల్పాహారం, భోజనంగా రాగులు తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం కూడా తక్కువ. రాగి పిండితో ఇడ్లీలు, దోశలు లేదా రాగులు మొలకలుగా కూడా తినొచ్చు.

ఊదలు

100 గ్రాములు ఊదల్లో 

15.1 గ్రాముల ప్రోటీన్,

5.3 గ్రాముల ఫైబర్  

87  గ్రాముల కాల్షియం

4. 4 గ్రాముల ఐరన్

రుచికి తియ్యగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్థకమైంది. ఊదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి. సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి, ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారు తినడం మంచిది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడకుండా ఊదలు పని చేస్తాయి. ఉత్తరాఖండ్, నేపాల్‌లో ఊదల ఆహారాన్ని చనుబాలు పెరగడం కోసం గర్భిణులకు, బాలింతలకు పెడతారు. ఇది కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలేయ, గర్భాశయ క్యాన్సర్‌ను తగ్గించడానికి ఊదలు పని చేస్తాయి.

జొన్నలు

100 గ్రాముల జొన్నల్లో పోషక విలువలు

క్యాలరీలు: 329

11 గ్రాముల ప్రోటీన్

3 గ్రాములు కొవ్వు

72 గ్రాముల కార్బోహైడ్రేట్లు

7 గ్రాములు పీచు పదార్థాలు

వీటితో పాటు విటమిన్ B1 (థయామిన్), విటమిన్ B6, రాగి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, జింక్ పోషకాలు కూడా జొన్నల్లో ఉంటాయి. జొన్నలు తినడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. జొన్న తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి. ఇందులో గ్లూటెన్ ఉండదు. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.

Show More
Back to top button