
వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులు పేరు, రుచి తెలియని వారు ఉండరు. ఇవి రుచికి బాగుండటమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అసలు పుట్టగొడుగులుగా అమ్మేవన్నీ సురక్షితమేనా? వీటిని గుర్తించక తింటే లివర్ని డ్యామేజ్ చెడిపోయి ప్రాణాలకే ముప్పు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ కాలంలో దొరికే అన్ని రకాల పుట్టగొడుగులు మంచివి కాదు అంటున్నారు. అయితే వీటిని ఎలా గుర్తించాలి? ఏ రకమైనా పుట్టగొడుగులు మంచివి? ఏవి మంచివి కాదు? వంటి విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా మన పరిసరాల్లో పెరిగే వాటిలో ఎక్కువగా విషపూరిత పుట్టగొడుగులే ఉంటాయి. ఇవి మంచి పుట్టగొడుగులా కాదా? అని కంటితో చూసి చెప్పడం కాస్త కష్టమే. కానీ కొన్ని లక్షణాల ఆధారంగా విషపూరితమైనవి ఏవో తెలుసుకుని వాటికి దూరంగా ఉంచవచ్చు.
పుట్టగొడుగు ఎరుపు రంగు క్యాప్ లేదా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉండి, కాండం చుట్టూ తెలుపు రంగు గీతలతో, పెరిగే తీరు ఒక గుత్తిలా లేదా రింగ్ షేప్లో పెరుగుతూ ఒక రకమైన వింత వాసన వచ్చే వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. తినగలిగే పుట్టగొడుగుల జాతులను ప్రస్తుతం కొందరు ప్రత్యేకంగా పెంచి విక్రయిస్తున్నారు. వాటిని తినడం బెటర్.