
ఆరుబయట ఇంటి అందం కోసం పెంచె మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటిల్లో రణపాల మొక్క ఒకటి అందరికీ తెలిసింది. ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే.. మొక్కలు ఇంట్లో పెంచుకోవడం పూర్వకాలం నుంచే కొనసాగుతోంది. రణపాల మొక్కల ఆకులు, కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలు దూరం చేస్తుంది. ఈ మొక్క ఆకులు మందంగా ఉంటాయి. వీటిని తింటే వగరుగా, పులుపుగా అనిపిస్తుంది. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా తినలేనివారు పావు లీటర్ నీళ్లల్లో నాలుగు రణపాల మొక్కల ఆకులను వేసి మరిగించుకొని కషాయంలా చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.
సకలరోగ నివారిణి
ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నట్లుగా రణపాల మొక్క అనేక అనారోగ్య సమస్యల నివారణకు వినియోగిస్తారు. నడుము నొప్పి, తలపోటుతో బాధపడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనంలా రాసుకుంటే మంచిది. మొలల సమస్య ఉన్న వారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే మంచిది. రణపాల మొక్కల ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులోని అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం. ఈ ఆకుల రసాన్ని ఉదయం, సాయంత్రం రెండు టీ స్పూన్లు సేవించడం వల్ల కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంపైన వాపులు, గాయాలకు ఈ మొక్క ఆకులు నూరి పేస్ట్‌ను గుడ్డలో ఉంచి కట్టుకట్టడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపనంగా రాసుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయని చెబుతారు.
helpline: ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజూ 40 నుంచి 50 ml సేవిస్తే స్త్రీలు జననాంగాల సమస్యల నుంచి బయట పడవచ్చు.