
పుట్టిన బిడ్డకు తల్లి పాలు అనేవి బిడ్డకు ఎంతో సురక్షితం మనందరికీ తెలిసిందే. అలాంటిది పాలు ఇచ్చే తల్లికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? ఈ సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా తల్లి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటే.. ఆ పాలు బిడ్డకు సురక్షితమే. కానీ, చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకుండా బిడ్డకు పాలిస్తే పలు సమస్యలు రావచ్చు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న తల్లి పాలు.. బిడ్డ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం(హైపోగ్లైసీమియా) జరుగుతుంది. దీంతో బిడ్డ శరీరంలో ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి తల్లి పాలు పెట్టే ముందు తినడం లేదా తీపి పదార్థం దగ్గర ఉంచుకోవడం మంచిది.
ఇక పోతే తల్లి పాలు ద్వారా శిశువుకు ఇమ్యూనో గ్లోబ్యులిన్లు (IgA, IgG), లాక్టోఫెరిన్, లైసోజైమ్ వంటి రోగనిరోధక పదార్థాలు అందుతాయి. ఇవి శిశువును ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
అలాగే, బ్రెస్ట్మిల్క్లోని bioactive compounds శిశువులో మేటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో ఇది భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.