గత కొన్ని రోజుల నుంచి బాగా వార్తల్లో ఉన్న పదం కార్నివాల్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ గురించి అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాండే చేసిన స్టంట్‌తో కార్నివాల్ క్యాన్సర్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..? ఎలా నివారించుకోవాలి..? మరి తెలుసుకుందామా..
అసలు కార్నివాల్ క్యాన్సర్ అంటే ఏంటి..?
కణాలు మితిమీరి ఉత్పత్తి అయితే.. క్యాన్సర్‌కి దారి తీస్తుంది. అలాగే కార్విక్స్ ప్రాంతంలో క్యాన్సర్ ప్రారంభం అయినప్పుడు కార్నివాల్ క్యాన్సర్ వస్తుంది. వజైన, గర్భసంచికి మధ్యలో ఉండే దాన్ని కార్విక్స్ అని అంటారు. ఇది గర్భసంచికి ద్వారంలా పని చేస్తుంది.
కార్నివాల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది..?
*కార్నివాల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం HPV(human papillomavirus ). ఇది లైంగికంగా సంక్రమించే ఒక వైరస్. ఈ
వైరస్ ఎక్కువ కాలం కార్విక్స్‌లో ఉండడం వల్ల క్యాన్సర్‌లా మారుతుంది. ఇతర కారణాలు ఇలా ఉన్నాయి..
*జననేంద్రియాల వద్ద శుభ్రత పాటించక పోతే కలిగే ఇన్ఫెక్షన్ల వలన.
*ఎక్కువ మందితో లైంగికంగా సంబంధం పెట్టుకోవడం.
*రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడం.
*స్త్రీలు గర్భ నిరోధక మందులు వాడడం.
*అధిక సంతానానికి జన్మనివ్వడం.
*లేట్‌గా పెళ్లి చేసుకోవడం వల్ల.
*పొగతాగే స్త్రీలల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాము.
కార్నివాల్ క్యాన్సర్ లక్షణాలు..!
*నెలసరికి నెలసరికి మధ్యలో రక్తస్రావం కావడం.
*నెలసరి తర్వాత కూడా రక్తస్రావం కావడం.
*మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కావడం.
*వజైన డిస్‌ఛార్జ్ ఎక్కువగా కావడం లేదా వజైన డిస్‌ఛార్జ్ లో వాసన రావడం.
*పొత్తి కడుపులో నొప్పి రావడం.
*నడుము నొప్పి రావడం.
*శృంగార సమయంలో నొప్పి. ముఖ్యంగా జననేంద్రియాల్లో నొప్పి రావడం.
*శృంగారం చేసే సమయంలో రక్తం రావడం.
కార్నివాల్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు
*21-65 మధ్య వయసు ఉన్న స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి.
*పొగతాగకూడదు.
*సురక్షితమైన సెక్స్ ఉత్తమం.
కార్నివాల్ క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు
*పాప్ స్మియర్ టెస్ట్
*క్లినికల్ టెస్టింగ్
కార్నివాల్ క్యాన్సర్ చికిత్స
కోన్ బయాప్సీ, లేజర్ బీమ్ ట్రీట్మెంట్, శస్త్రచికిత్స, కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇలా కార్నివాల్ క్యాన్సర్‌కు వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్స పూర్తయిన తర్వాత, క్యాన్సర్ కణాలు తొలగించాక కూడా ఫాలోఅప్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉండాలి.