
ప్రస్తుతకాలంలో ఆహార అలవాట్లతో పాటు మారిన జీవనశైలితో అధికశాతం ప్రజలు బరువు పెరుగుతున్నారు. దీంతో కొందరు తమను తాము తక్కువ చేసి చూసుకుంటున్నారు. బరువు తగ్గేందుకు అనేక డైట్లు పాటిస్తుంటారు. అయితే ఫలితం లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివారు వ్యాయామాలు చేయడంతో పాటు ఇంట్లో ఉండే చింతపండు అధికంగా తీసుకుంటే బరువు తగ్గించుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. రుచికి పుల్లగా ఉండే చింతపండులో అనేక ఔషధ గుణాలు కలిగి శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
చింతపండు మెటబాలిజం పెంచి ఆకలిని తగ్గించడం కారణంగా అధికంగా తినే సమస్య నుంచి తప్పించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో చింతపండులోని హైడ్రాక్సీసిట్రిక్ ఆసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాయామాలు చేస్తూ చింతపండు తినటం వల్ల శరీర బరువు తగ్గించవచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి3, బి5, బి6 లతో పాటు ఐరన్, సోడియం, క్యాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి శరీరానికి కావలసిన పోషకాలు చింతపండులో అధికంగా ఉంటాయి. అందిస్తాయి. వ్యాయామం చేసే సమయంలో కొవ్వు తొందరగా కరిగేందుకు ఇది సహాయపడుతుంది.
కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కుడంపులిగా పిలిచే మలబార్ చింతపండుతో త్వరగా బరువు తగ్గవచ్చు.