
చాలామంది చాక్లెట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇది పెద్దలకి స్ట్రెస్ రిలీఫ్‌గా కూడా ఉంటుంది. కానీ అదే చాక్లెట్ సిగరెట్ కన్నా డేంజరస్ అనే సంగతి తెలుసా? మెత్తగా ఉండే ఈ మిఠాయి వెనక ఎంతో కఠినమైన హానికర రహస్యాలు దాగున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చాక్లెట్‌లో ఉండే అధిక చక్కెర శరీరంలో మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలకు దారితీస్తుంది.
అంతేకాదు చాక్లెట్‌లో ఉండే కాడ్మియం, లీడ్ వంటి హానికరమైన లోహాలు శరీరానికి హానికరంగా మారవచ్చు. కాబట్టి చాక్లెట్స్‌ని మితంగా తీసుకోవడం మంచిది.