HEALTH & LIFESTYLE

డేంజర్: మరో కొత్తరకమైన డైయాబెటిస్ వస్తుంది.!

“అయ్యో బాబోయ్..” డయాబెటిస్ అంటే పెద్దవాళ్లకే వస్తుంది అనుకున్నాం కదా! కానీ ఇప్పుడు 19 ఏళ్ల లోపు పిల్లలకు, యంగ్ స్టర్స్‌కు కూడా కొత్త రకం డయాబెటిస్ వస్తోంది అంటే నమ్మగలరా? ఇది మామూలు షుగర్ వ్యాధి కాదు సుమా! దీన్ని కనిపెట్టడం కూడా కష్టమట.. ఇంక ట్రీట్మెంట్ సంగతి అంటారా.. అస్సలు లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఈ కొత్త డయాబెటిస్ ఏంటి? ఎందుకు వస్తోంది? మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం.  

ఇక మేటర్లోకి వెళ్తే..

ఇప్పటివరకు మనకు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించి తెలుసు. కానీ ఇప్పుడు టైప్ 5 అనే కొత్త రకం డయాబెటిస్ వస్తోంది. ఇది ముఖ్యంగా 19 ఏళ్ల లోపు యువతకు వస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన పోషకాహారం లేకపోవడం. అంటే, కడుపు నిండా తింటున్నా.. శరీరానికి కావలసిన పోషకాలు అందకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2.5 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది సాధారణ డయాబెటిస్ లాగా ఉండదు. దీనికి చికిత్స కూడా లేదు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా పనిచేయవు. కాబట్టి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. దీనిని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) అధికారికంగా ప్రకటించింది. కాబట్టి, 19 ఏళ్ల లోపు యువత పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.

Show More
Back to top button