
మారుతున్న సీజన్‌తో పాటు ఆహారం విషయంలో కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయా సీజన్లలో ప్రత్యేకంగా లభించే ఫ్రూట్స్, ఇతర కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను తప్పకుండా భోజనంలో భాగం చేసుకోవాలి.
* పసుపు పొడి కలిపిన పాలు తాగాలి. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఫ్రూట్స్ తినాలి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
* పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.
* ఆకుపచ్చ కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటితో తయారు చేసిన కూరలను తినాలి.
* వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటిని కూరల తయారీలో భాగం చేయాలి.
* యాపిల్స్, లిచీ, ప్లమ్స్, చెర్రీస్, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు తినాలి.
* వర్షాకాలంలో అంటువ్యాధులు, జ్వరంతో బాధపడేవారు అల్లం, తులసి, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు వంటి ఔషధ మసాలా దినుసులతో తయారుచేసిన డికాక్షన్ తాగడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.