HEALTH & LIFESTYLE

మేనరికపు పెళ్లిళ్ల వల్ల పిల్లలకు జన్యు వ్యాధులు వస్తాయా?

సినిమాల ప్రభావం వల్లనో.. సోషల్ మీడియాల ప్రభావం వల్లనో మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఇబ్బందులు కలగవచ్చని అవగాహన పెరిగింది. అయినా ఎక్కడో ఒక దగ్గర మాత్రం మేనరికం పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అసలు ఇలా మేనరికం పెళ్లి చేసుకుంటే మంచిదేనా? దీనివల్ల పుట్టబోయే పిల్లలకు లోపాలు కలుగుతాయా? అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. మేనరికంలో పెళ్లి చేసుకునే సమయంలో అమ్మాయి, అబ్బాయికు ఎలాంటి జన్యుపరమైన లోపాలు లేకపోతే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎదైనా జన్యు లోపాలు ఉంటే జన్మించే బిడ్డకు కూడా లోపం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తాజగా హైదరాబాద్‌‌లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఏపీలోని మేనరిక పెళ్లిలు చేసుకున్న 281 మంది రక్త నమూనాలు సేకరించి జన్యుక్రమాలను పరిశీలించారు. అందులో ఎక్కువ మందికి ఈ జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయని తేల్చారు.

అందరికీ ఇలాగే జరుగుతుందా..?

అలా అని మేనరికం పెళ్లిళ్లు చేసుకున్న అందరికీ లోపాలుగల పిల్లలు పుడతారని లేదు. బిడ్డ ఆరోగ్యం అనేది పూర్తిగా జన్యువుల మీదనే ఆధారపడి ఉంటుంది. దూరపు సంబంధాలు చేసుకున్న వారికి కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఈ దూరపు సంబంధాల్లో 400 జంటల్లో ఒకరికి లోపాలతో బిడ్డ పుట్టే అవకాశం ఉంటే.. దగ్గర సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లో ఒక బిడ్డ లోపాలతో పుట్టే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి. మరికొన్ని సమయాల్లో పిల్లలు జన్మించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయట. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలను, వీలైతే అసలు ఏ విధమైన రక్తసంబంధం లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను చేసుకోవడం మంచిది. విభిన్న ప్రాంతాలు, సంస్కృతుల వ్యక్తులు దంపతులుగా మారితే వారి పిల్లలు మరింత తేజస్సుతో పుట్టే అవకాశముంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మేనరికంతో ఒకే రకమైన జన్యువులు ఉండటం వల్ల ఇతర పిల్లలతో పోలిస్తే వీరిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి మేనరికపు పెళ్లిళ్లు చేసుకునే ముందు ఒకసారి అబ్బాయి, అమ్మాయి జన్యు పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు. వీరే కాదు.. పెళ్లి చేసుకుందాం అని అనుకునే ప్రతి అమ్మాయి, అబ్బాయి ఫిజికల్ టెస్ట్ చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా గర్భం దాల్చినప్పుడు తప్పకుండా రెగ్యులర్ చెకప్‌తో పాటు జన్యు సంబంధిత పరిక్షలు కూడా అవసరం.

Show More
Back to top button