HEALTH & LIFESTYLE

ఆడవాళ్లు వేగంగా బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

కొంతమంది ఆడవాళ్లు ఏమీ తినకపోయినా.. బరువు పెరుగుతూ బూర్రులా అవుతారు. అయితే ఇలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలుసా? హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, థైరాయిడ్, PCOS వంటి ఆరోగ్య సమస్యలు వల్ల బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వీటిపై సరైన అవగాహన లేకపోతే మాత్రం భవిష్యత్‌ పలు రకాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వీటి గురించి ఇప్పుడు తెలుసకుందాం. 

మొదటిది

ఆడవాళ్ల జీవితంలో పబ్‌ర్టీ, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటి దశల్లో హార్మోన్లు ఎక్కువగా మారిపోతాయి. ఇవి మెటాబాలిజాన్ని ప్రభావితం చేసి శరీరంలో కొవ్వు నిల్వల రూపంలో మార్పులు తీసుకొచ్చి బరువు పెరిగేలా చేస్తుంది.

రెండోవది

నిద్రలేమి: నిద్ర సరిపోకపోతే కోర్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచి, అధికంగా తినడానికి దారి తీస్తుంది.

మూడోవది

PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్):

ఇది ఎక్కువ మంది యువతుల్లో కనిపించే హార్మోనల్ డిసార్డర్. ఈ సమస్య వల్ల ఇన్‌సులిన్ రెసిస్టెన్స్ పెరిగి బరువు పెరుగుతారు.

చివరిగా

థైరాయిడ్ సమస్యలు:

హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ల మెటాబాలిజం నెమ్మదిగా పని చేస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి వినియోగం తగ్గి బరువు పెరుగుతుంది. దీంతో పాటు ఆఫీసు జీవితం, హోం బేస్డ్ బిజీ షెడ్యూల్స్ వల్ల చాలామంది ఆడవాళ్లు కదలికలు తగ్గించేస్తారు. దీని ప్రభావం కాలక్రమంలో బరువు పెరుగుదలగా కనిపిస్తుంది.

Show More
Back to top button