నోరు, దంతాల సంరక్షణలో బ్రష్ చేయడం ముఖ్య పాత్ర వహిస్తుంది. రోజూ చేసే పనేలే అన్నట్టుగా అశ్రద్ధగా బ్రష్ చేస్తారు. పళ్లు తోమడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
అవి:
*ఒక టూత్‌బ్రష్‌ను 2 నెలల కంటే మించి వాడకూడదు.
*రోజూ బఠానీ గింజ అంత పేస్ట్ మాత్రమే వాడి, 2 లేదా 3 నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి.
* ప్రస్తుతం చాలామంది ఎలక్ట్రానిక్ టూత్‌బ్రష్ వాడాలనుకుంటున్నారు. నోటిని శుభ్రం చేయడానికి మ్యానువల్ టెక్నిక్స్ కావాలి. చేతితో బ్రష్ చేసుకోవడమే మంచిదని డెంటిస్ట్‌లు అంటున్నారు.
*ఎక్కువసేపు బ్రష్ చేస్తే, దంతాలపై ఉండి రక్షించే సున్నితమైన ఎనామిల్ పొర డ్యామేజై సెన్సిటివిటీ వస్తుంది.