
ఈ కాలంలో ఎవరి చెవిలో చూసినా ఈ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు వీటిని చెవిలో పెట్టుకుని వింటుంటే… మనసుకు ఎంతో హాయిగా ఉంటుందో.. అంతే నష్టం కూడా ఉంటుందని మీకు తెలుసా? అయితే ఇవి.. చెవిని ఎలా, ఎంత వరకు.. ప్రభావింతం చేస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా ధ్వనిని డెసిబుల్స్‌లో కొలుస్తారు. అయితే మన చెవికి 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని వింటే.. చెవికి ప్రమాదం. ముఖ్యంగా ఎక్కువ సేపు హై వాల్యూమ్‌లో వినడం వల్ల చెవుల లోపల ఉండే సెన్సిటివ్ హేర్ సెల్స్ (Hair Cells) పాడై శాశ్వతంగా వినికిడి నష్టం (Hearing Loss) వచ్చే అవకాశం ఉంది.
* ఇక కొంతమందిలో హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల నుండి వచ్చే సౌండ్ మన కర్ణభేరిని తాకడం వల్ల చెవుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఇయర్ బడ్స్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల మెదడు కణజాలం దెబ్బతిట్టాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* 60/60 రూల్ ఫాలో అవ్వండి – 60% వాల్యూమ్‌తో మాత్రమే, గంటకు 60 నిమిషాల కంటే ఎక్కువ వినకండి.
* నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ వాడండి – అవి ఎక్కువ శబ్దం లేకుండా వినేందుకు బాగా ఉపయోగపడతాయి.
* నాణ్యత గల ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించండి.