HEALTH & LIFESTYLE

రక్త ప్రసరణ నెమ్మదిస్తే.. తిప్పలు తప్పవు..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. రక్త ప్రవాహం సరిగ్గా లేక రక్తనాళాల నొప్పి, కండరాల తిమ్మిరి, జీర్ణ సమస్యలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చల్లదనం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ తగ్గడానికి కారణం స్థూలకాయం, ధూమపానం అలవాటు, డయాబెటిస్, రేనాడ్ వ్యాధి వంటివి ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య మందుల వాడకం దగ్గరకు పోకుండానే కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. 

ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారం

ఉల్లిపాయ, దానిమ్మ వంటి ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్త నాళాలను శుభ్రంగా ఉంచి, మెరుగైన రక్త ప్రవాహానికి అవకాశం కల్పించే దానిమ్మ జ్యూస్‌ను తాగొచ్చు.

నైట్రిక్ ఆక్సైడ్ ఉండే పదార్థాలు 

ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, బీట్రూట్, ఆకుకూరలు వంటి నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు. ఇవి ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పసుపులో కర్క్యూమిన్ అనే రసాయనం మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. 

విటమిన్-C

నారింజ, నిమ్మ, ఉసిరిలాంటి సిట్రస్ పండ్లు తింటే రక్త ప్రసరణకు మంచిది. విటమిన్-C రక్త ప్రవాహాన్ని పెరిగినప్పుడు రక్తపోటు, ధమనులలో దృఢత్వాన్ని తగ్గిస్తాయి. పుచ్చకాయలోని లైకోపీన్ అనే పదార్థం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ సహజ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

గింజలు

బాదం, వాల్ నట్స్ వంటి గింజలు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాల్‌నట్స్‌లో ఎల్-అర్జినైన్ నైట్రిక్ ఆమ్లం రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

టమోటాలు, బెర్రీలు

టమాటాలు, బెర్రీలు ఉండే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ రక్తపోటును నిరోధిస్తాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్ గుండెజబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. టమాటాల్లో ఉండే విటమిన్-K రక్తప్రసరణను మెరుగుపరుస్తూ రక్తస్రావం, రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ధమనుల అతుక్కుపోకుండా విడదీస్తాయి.

Show More
Back to top button