HEALTH & LIFESTYLE

జిమ్‌కి వెళ్తే.. ఎందుకు బరువు పెరుగుతుంది?

చాలామందికి మొదట్లో జిమ్ పట్ల ఉన్న ఆశ, కొన్ని రోజుల్లోనే ఎందుకు చల్లబడిపోతుందో తెలుసా? రోజూ వర్కౌట్ చేసి… చెమటోడ్చేంతగా కష్టపడుతుంటారు. కానీ కొన్ని రోజులు గడిచాక చూసుకుంటే, బరువు తగ్గడంలేదు, పైగా కొంచెం పెరిగిందేమో అనిపిస్తుంది. అక్కడే చాలామందికి మళ్లీ మూడ్ డౌన్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వంటి విషయాలు  తెలుసుకుందాం.  

సాధారణంగా మనం జిమ్‌లో కష్టపడి వర్కౌట్ చేస్తే శరీరానికి ఇంకాస్త ఎనర్జీ కావాలి కదా.. దానికి తగ్గట్టుగానే ఆకలి పెరుగుతుంది. దీంతో మెల్లగా తినే పరిమాణం కూడా పెరుగుతుంది. మనం గుర్తించకపోయినా, అదనంగా తినే ఆహారంతో మళ్లీ ఎక్కువ కేలరీలు వచ్చి బరువు పెరుగుతుంటుంది.

మరొకటి, వర్కౌట్ చేస్తున్నప్పుడు కండరాల్లో గ్లైకోజన్ నిల్వలు పెరుగుతాయి. దీంతో గ్లైకోజన్ శరీరంలో నీటిని ఆకర్షించి, కండరాల్లో ఉండేడట్లు చేస్తోంది. దీంతో మనం ఫ్యాట్‌గా ఉన్నాం అనుకుంటాం.  

అలాగే, కండిషన్ బాగాలేకపోతే, విశ్రాంతి తీసుకోకపోతే శరీరంలో హార్మోన్లు గందరగోళం అవుతాయి. దాంతో బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే, జిమ్‌కి వెళ్లడమే కాదు… సరైన డైట్, తగిన రెస్ట్, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ఇవి సరిగ్గా లేకపోతే.. ఎంత కష్టపడినా మనం కావాల్సిన ఫలితం చూడలేం.

Show More
Back to top button