HEALTH & LIFESTYLE

చలి పెరిగితే.. కీళ్ల నొప్పులు ఎందుకు?

శీతాకాలంలో జలుబు, దగ్గు తరచూ వస్తుంటాయి. అలాగే కీళ్లు ఎక్కువగా నొప్పులు కూడా వస్తాయి. దగ్గు జలుబుకు కారణం చల్లటి వాతావరణం. మరి కీళ్ల నొప్పులు ఎందుకు అధికమవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? చలి తీవ్రత పెరిగితే.. ఉష్ణోగ్రత తగ్గి కండరాల నొప్పులు వస్తాయి. దీనివల్ల కండరాల దృఢత్వం తగ్గి, కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. అంతేకాదు.. ఈ టైంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. కాబట్టి, తగినంత విటమిన్-D శరీరానికి అందక ఎముకలు బలహీనమవుతాయి.

శీతాకాలంలో జాయింట్ పెయిన్స్ రావడానికి మరో కారణం. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాళ్లు, చేతి వేళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో కీళ్లు వాపుకు గురై, నొప్పిగా అనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వృద్ధులు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇవి పాటించండి.

ఇలా చేస్తే సేఫ్..

ఎక్స్‌ర్‌సైజ్:
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి తగిన శ్రమ ఉండాలి. అందుకోసం రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బాడీని కదిలించడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు కఠినమైన వర్కౌట్స్ చేయవద్దు.

హైడ్రేడ్‌గా, వెచ్చగా ఉండండి:
వేడినీటితో స్నానం చేయండి. చలికాలం ఎక్కువగా నీళ్లు తాగడానికి ఇష్టపడరు. దీంతో శరీరం డీ హైడ్రేడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తాగడానికి గోరు వెచ్చని నీరు వినియోగించండి. వేడి వేడి బోన్ సూప్ తాగండి. బయటకు వెళ్లేటప్పుడు నిండైన బట్టలు ధరించండి. చెవిలోకి చలిగాలి వెళ్లకుండా తల భాగాన్ని కవర్ చేయండి.

ఒమేగా-3 తీసుకోండి:
శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం కీళ్ల వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో కీళ్ల నొప్పులను నివారించడానికి సాల్మన్, వాల్‌నట్స్, అవిసె గింజలు, అవకాడో తీసుకోవాలి.

Show More
Back to top button