HEALTH & LIFESTYLE

ఫ్రిజ్ నీరు ఆరోగ్యానికి మంచివేనా.?!

వేసవికాలం.. ఎన్ని నీళ్ళు తాగినా.. దాహం వేస్తూనే ఉంటుంది. తాగుతూనే ఉంటాం. దప్పిక తీరేందుకు సోడా, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తుంటాం. నిజానికి చాలామంది ఇళ్లల్లో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుంచి రాగానే అలా చల్లగా మారిన నీటిని తాగేస్తుంటారు. అయితే ఇలా చాలామంది ఫ్రిజ్ నుంచి నేరుగా నీరు తీసుకొని తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందా? అంటే అవును అనే అంటున్నారు పోషకాహార నిపుణులు.. నార్మల్ వాటర్ ఎంత తాగిన తాగినట్లు అనిపించక.. ఫ్రిజ్ నీరు తాగడమే మంచిది అనుకుంటారు చాలామంది. అలా కాసేపు ఊరట కోసం ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టకూడదు అనుకుంటే ఈరోజు చల్లని నీరు తాగడం వల్ల కలిగే చేటు గురుంచి ఈరోజు చెప్పుకుందాం:

ఫ్రిజ్ నుంచి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్లుగా ఆ కాసేపు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ కొద్దికొద్దిగా మందగిస్తుంది. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు, ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతాయి. అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడానికి చాలా ఆలస్యమవుతుంది.

ఫ్రిజ్ నీళ్ళు తాగేవారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందనీ కొన్ని సర్వేలు తెలిపాయి. ఈ కారణంగా బరువు తగ్గడం అనేది కష్టమవుతుంది. మరి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఫ్రిజ్ లో నీరు తాగకపోవడం ఉత్తమం. దీనివల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. మలబద్దకం రావచ్చు.  

ఫ్రిజ్ లో చల్లని నీరు అదే పనిగా అలవాటుగా తాగడం వల్ల మైగ్రైన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది తలనొప్పి సమస్యను మరింత పెంచుతుంది. ఇప్పటికే మైగ్రేన్ సమస్యతో ఇబ్బందిపడేవారు చల్లని నీటిని తాగేందుకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలోనీ నీటిని తాగవచ్చు. అప్పట్లో మన పూర్వీకులు, పెద్దలు కుండల్లో నీటిని తాగేవారు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడంతా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అంటూ వింత పోకడలు.. విచిత్రపు అలవాట్ల మూలానా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.

Show More
Back to top button