HEALTH & LIFESTYLE

నిద్రపోదాం.. హాయిగా!!

మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతామట. ఎందుకంటే హెల్తీగా ఉంచేది నిద్రనే కాబట్టి.. ఒక్కరోజు సరిగా నిద్ర పట్టకపోతే ఆ రోజంతా బరువుగానే గడుస్తుంది. ఎక్కడలేని చిరాకు, అలసట కలుగుతాయి. దీనికి తోడు తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటివి వేధిస్తాయి. ఇలాగే కొన్నాళ్లపాటు కొనసాగితే గనుక నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అంతేకాదు ఇలాంటి ఎన్నో నిద్రసమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి వాటిని ముందుగానే గ్రహించి, జాగ్రత్త పడదాం:

పగటిపూట నిద్రపోవడం.. చాలావరకు పగలు నిద్రపోవడం సహజం.. అలాగని ఏదో కాసేపు కునుకు తీస్తే ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువసేపు పడుకుంటేనే రాత్రి పూట నిద్ర త్వరగా పట్టదు. దీంతో బాడీలో జీవ గడియారమూ గతి తప్పుతుంది. సమయానికి నిద్ర లేదంటే, ఏ పని మీద ఆసక్తి పెట్టలేం. తిండి కూడా వేళకు తీసుకోకపోవడంతో ఆరోగ్యం పాడవుతుంది.

కాబట్టి పగటి నిద్రను మానేయండి.

వ్యాయామం.. హెల్తీ ఎక్సర్సైజ్.. మనల్ని ఎల్లప్పుడూ హెల్తీగా ఉంచుతుంది. ఇందుకు రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమం. లేదంటే ఈవెనింగ్ సరదాగా నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేస్తే మనసు, శరీరం రెండు తేలికవుతాయి. దీంతో రాత్రిపూట గాఢమైన నిద్ర పడుతుంది.

నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్/ ల్యాప్ టాప్ లు చూడటం అందరికీ అలవాటే. ఇవి చూస్తూ అర్థరాత్రుళ్ళ వరకు మెలకువ ఉండటం వల్ల నిద్ర సరిపోదు. కాబట్టి మీకు నచ్చిన ఎదైనా బుక్ చదవడం, నచ్చిన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. 

పొద్దున, సాయంత్రం టైంలో కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారికి రాత్రి నిద్ర పట్టటం కష్టమవుతుందనీ ఓ అధ్యయనంలో తేలింది. కూల్‌ డ్రింకులు, రెడ్‌ వైన్‌, చాక్లెట్లు, ఛీజ్‌ వంటివీ కూడా నిద్రకు చేటు చేస్తాయి.

కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. 

రాత్రిపూట లేట్ గా భోజనం చేయడం వల్ల, తిన్నది త్వరగా జీర్ణమవ్వదు. హెవీ మీల్స్ కు బదులుగా లైట్ ఫుడ్ కి ప్రాధాన్యతనిస్తూ, పడుకునే మూడు గంటల ముందు భోజనం తినేయడం ఉత్తమం. మీ రోజువారీ అలవాట్లలో ఈ చిన్న మార్పులు చేసి, చక్కగా నిద్రపోండి మరీ!

Show More
Back to top button