HEALTH & LIFESTYLE

పానిక్ అటాక్ లక్షణాలు, జాగ్రత్తలు.!

ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పదం పానిక్ అటాక్. నేటి జనరేషన్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే. తీవ్రమైన భయం, బాధ లేదా ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే ఆందోళన వల్ల పానిక్ అటాక్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది వచ్చినప్పుడు గుండెపోటు వచ్చినట్టుగా, శరీరంపై కంట్రోల్ పోతున్నట్లుగా అనిపిస్తుంది. పలుసార్లు చనిపోతున్నాం అనే భావన కూడా కలుగుతుంది. ఇది సాధారణంగా చాలామందికి ఏదో ఒక సమయంలో వస్తుంది.

జీవిత కాలంలో ఒకటి లేదా రెండు సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది దానంతట అదే వెళ్లిపోతుంది. ఇలా అప్పుడప్పుడు వచ్చేదాన్ని పానిక్ అటాక్ అని అంటారు. అలా కాకుండా తరచూ వస్తుంటే దాన్ని పానిక్ డిజార్డర్ అని అంటారు. ఇది ప్రాణాపాయం కానప్పటికీ జీవనశైలిని మారుస్తుంది. ఎలా అంటే.. రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం. శరీరంలో బలం లేకపోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల ఇతర పనులు చేసుకోవడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి, దీన్ని వీలైనంత త్వరగా పోగొట్టుకోవడం చాలా అవసరం.

పానిక్ అటాక్ లక్షణాలు..

తీవ్రంగా భయపడడం , నియంత్రణ కోల్పోవడం , హార్ట్ బీట్ పెరగడం

చెమటలు పట్టడం , వణుకు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

వేడి ఆవిర్లు , వికారం , కడుపులో తిమ్మిరి , ఛాతీ నొప్పి

తలనొప్పి , మైకం ,తల తిరగడం.

Show More
Back to top button