HEALTH & LIFESTYLE

భారీ వర్షాల దృష్ట్యా ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!

భారీ వర్షాల దృష్ట్యా ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. తాగే నీటి దగ్గరి నుంచి… అన్నింట్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం పదండి.

* దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే రోజూ చేతులు, కాళ్లకు ఇన్సెక్ట్ రెపెల్లెంట్ రాసుకుంటే మంచిది. అలాగే యాంటీ మలేరియా మందులను కూడా తీసుకోవడం చాలా ఉత్తమం.  

*  వర్షం పడుతున్నప్పడు  వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలా జరగకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు.. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి.

* స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు ఈ సీజన్‌లో జాగ్రత్తలు వహించాలి. వీలైనంత వరకు బయట తినడం మానేయాలి. అంతేకాదు… బయట కొన్న పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగాకే తింటే మంచిది.

 * వానలో తడిస్తే ఇంటికి రాగానే… తడిగా ఉన్న బట్టలు, సాక్స్‌ని విప్పేయాలి. కాళ్లను నీళ్లతో కడిగి తుదుచుకోవాలి. 

* వర్షంలో తడిచాక స్నానం తప్పనిసరిగా చేయాలి. 

* మార్కెట్‌లో దొరికే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుని వాడడం ఉత్తమం. అప్పుడే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 

* శరీరాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకుంటే… జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.

* ఇనుప తీగలపై దుస్తులు అరబెట్టుకోవద్దు. 

* చిన్న పిల్లలు కరెంట్ వస్తువుల జోలికి రాకుండా చూసుకోవాలి.

* పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండరాదు.

* తడి చేతులతో స్టార్టర్లు, తడిచిన విద్యుత్ స్తంభాలు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు.

* ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలి. 

* విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు.

Show More
Back to top button