HEALTH & LIFESTYLE

ఆహారంలో రసాయనాల ముప్పు

ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో నిజంగా పోషకాలు ఉన్నాయా? పండ్లు, కూరగాయలు పండించేందుకు రైతులు వాడే క్రిమిసంహారకాలు, ఫలాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వాడే కెమికల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు… ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతవరకు హానికరమో తెలుసా? అవును, మనం తినే ప్రతి ముద్దలో అనేక రసాయనాలు దాచిపెట్టబడి ఉన్నాయి. అవి నెమ్మదిగా శరీరంలో చేరి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. మరి, ఆహారంలో రసాయనాల ముప్పు ఎలా ఉంది? దీని ప్రభావం ఏమిటి? తెలుసుకుందాం!

ఈ రోజుల్లో మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయలు సహజంగా పెరుగుతున్నాయా? కాదు! ఇవి ఎక్కువ దిగుబడికి, రంగు మెరుగు కోసం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వివిధ రసాయనాలతో కలపబడుతున్నాయి. పెస్టిసైడ్లు, ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్… ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో భాగమైపోయాయి. ముఖ్యంగా, ఎత్తైన నిల్వ గోడౌన్లలో పదేళ్ల పాటు పాడైపోకుండా ఉంచేందుకు ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అధికంగా కెమికల్స్ వాడుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలి!

మొదటిది

* పెస్టిసైడ్ల ప్రభావం

సాధారణంగా రైతులు పంటలను పురుగుల నుండి కాపాడటానికి ఎక్కువగా క్రిమిసంహారకాలను (pesticides) వాడుతున్నారు. ఈ పెస్టిసైడ్ల అవశేషాలు శరీరంలో చేరితే క్యాన్సర్, నరాల సంబంధిత వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

రెండోవది

* ఆర్టిఫిషియల్ రిపెనింగ్ కెమికల్స్

పండ్లు, కూరగాయలు త్వరగా పండేందుకు క్యాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు వాడతారు. ఇవి నెవ్రస్ డిజార్డర్స్, గర్భిణీ మహిళల ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు తీసుకురావచ్చు.

మూడోవది

* ఫుడ్ కలర్స్ & ప్రిజర్వేటివ్స్

ఆహారం ఆకర్షణీయంగా ఉండేందుకు కలర్ కలిపే కెమికల్స్‌లో కొన్ని క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎక్కువగా కలిపే ప్రాసెస్డ్ ఫుడ్స్ అలర్జీలు, లివర్ డామేజ్, కిడ్నీ సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది.

చివరిగా..

* ప్రాసెస్డ్ ఫుడ్‌లో అధిక కెమికల్స్

జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు సోడియం బెంజోయేట్, బుటిలేటెడ్ హైడ్రాక్సీ టోల్యూన్ (BHT), మోనోసోడియం గ్లుటామేట్ (MSG) వంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తారు. ఇవి మెటబాలిక్ సమస్యలు, మతిమరుపు, గుండె జబ్బులు తెచ్చే ప్రమాదం ఉంది.

అయితే… బెస్ట్ సొల్యూషన్స్‌గా ఎలాంటి ఆహారం తీసుకోవలంటే..?

1. సేంద్రియ ఆహారం (Organic Food) తీసుకోండి

అంటే.. పెస్టిసైడ్లు లేని ఆర్గానిక్ ఫుడ్స్‌ను ఎంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

2. తాజా ఆహారం తినండి

అంటే.. పురుగు మందులు, కెమికల్స్ తక్కువగా ఉన్న, స్థానికంగా దొరికే తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది.

3. ఫుడ్ ప్రాసెసింగ్ తగ్గించండి

అంటే.. అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ (packaged food, junk food) తీసుకోవడం తగ్గించాలి.

4. తగినంత నీరు తాగండి – శరీరాన్ని డిటాక్స్ చేసుకోండి

రోజుకు కనీసం 3-4 లీటర్లు నీరు తాగడం ద్వారా శరీరంలో చేరిన విషతత్వాలు తొలగించుకోవచ్చు.

ఈ రోజుల్లో ఆహార భద్రత చాలా ముఖ్యమైన విషయం. మనం తినే ఆహారం ఏ రకంగా తయారైంది? దానిలో ఏమి కలిపారు? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదని అనుకుంటే, రసాయనాల లేని ఆహారాన్ని ఎంచుకోవడం అలవాటు చేసుకోవాలి.

Show More
Back to top button