HEALTH & LIFESTYLE

చింత చేసే మేలు.. అంతా.. ఇంతా కాదు..!

మన జీవనంలో భాగంగా మారిన వంట పదార్థం చింత. ఇది లేనిదే భారతీయ వంటకాలు పూర్తి కావు. చింతచిగురు, చింతకాయలు, చింతపండు.. ఆఖరికి చింత గింజలతో సహా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చింత చెట్టు లేని ఊరు, చింతపండు వాడని ఇల్లు మనదేశంలో ఉండవంటే అతిశయోక్తి కాదు.  విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్ వంటి విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్న దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్.. మెటబాలిజమ్‌ను స్టిమ్యులేట్ చేస్తుంది. చింతతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

చింతతో రోటిపచ్చడి.. సాంబారు, రసం, పులుసు కూర, పండుమిర్చి, అల్లం తదితర నిల్వ పచ్చళ్లు… ఇలా ఏది చేయాలన్నా చింతపండు ఉండాల్సిందే. ఒక్క చింతపండు అనేముంది, చింతచిగురు, చింతకాయలతో చేసే రుచులకీ లెక్కేలేదు. ఈ సీజన్లో దొరికే చింతకాయల్ని తొక్కులా రుబ్బి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడుకుంటారు. జ్వరం నోటికి పత్యంలో భాగంగా చింత కాయ పచ్చడితో అన్నం పెట్టమంటారు ఆయుర్వేద వైద్యులు.

సైనస్ బాధితుల్నీ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లనూ చింతపండుకి దూరంగా ఉండ మనీ పులుపుకి ప్రత్యామ్నా యంగా టొమాటో, నిమ్మ వాడమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ.. సంప్రదాయ వంటల్లో చింత పండుని పూర్తిగా పక్కకు పెట్టే యడం కష్టమైన పనే అయింది. అంత అవసరం లేదు కూడా అంటున్నాయి. తాజా పరిశోధనలు. ఎందుకంటే నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం మాదిరిగానే చింతకాయ, చింతపండులోని టార్టారిక్ ఆమ్లం శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుందట. ఇది శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. చింతపండు లోని లిమోనిన్, జెరానియోల్, శాఫ్రోల్, సినామిక్ ఆమ్లం, మిథైల్ శాలిసిలైట్… వంటి ఫైటో కెమికల్స్ ఔషధాల్లా పనిచే స్తాయి. ఇందులో కాపర్, పొటా షియం, కాల్షియం, ఐరన్, విట మిన్-ఎ, రిబోఫ్లేవిన్, విటమిన్ 

సి… వంటి పోషకాలకూ లోటు లేదు. కొన్ని మందుల్లోనూ చింత పండు నుంచి తీసిన పదార్థాలను వాడుతుంటారు.

క్యాన్సర్ ను అడ్డుకుంటుంది…

చింతపండు క్యాన్సర్ కు అడ్డుకుంటుంది. ఇందులోని పీచు- తినే ఆహారంలోని టాక్సిన్లను బంధించి బయటకు పంపడంతోపాటు పేగులోని క్యాన్సర్ కారక రసాయనాలు మ్యూకస్ పొరను దెబ్బతినకుండా చేస్తుంది.

గర్భిణులకు మేలు…

గర్భిణులకి చింతకాయల్లోని పీచూ ఆమ్లాలూ ఉదయాన్నే వచ్చే వికారం, వాంతులు, అలసట, మలబద్ధ కాన్నీ తగ్గిస్తాయి. చింతకాయలకి ఉప్పు, మిరియాలపొడి అద్దుకుని తింటే వికారం తగ్గుతుంది.

కాలేయ పనితీరుకు…

చింతపండు కాలేయ పని తీరునీ జీర్ణక్రియనీ పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికీ దోహదపడుతుంది.

చింతపండురసం, పటిక బెల్లం కలిపి మరిగించి తాగితే గుండెల్లో మంట తగ్గుతుందట. అరటీస్పూను చింతగింజల పొడిని కాస్త వేయించి నీళ్లలో కలిపి రోజుకి రెండుసార్లు తీసు కుంటే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయట. వేయించి పొడిచేసిన చింతగింజల్ని తేనెతో కలిపి రోజుకి మూడునాలుగుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తశుద్ధికీ తోడ్పడ తాయి. ఇందులోని థైమీన్ నరాల పనితీరునీ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తుంది. చింతలోని పులుపు గుణం ఇన్సులిన్ శాతాన్ని పెంచి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది.

వేసవి ప్రారంభంలో వచ్చే చింతకాయలతో చేసే పప్పుచారూ, చింతతొక్కుతో చేసే పచ్చళ్లూ, ఆ తరవాత కొత్త చింతపండుతో చేసే ఉగాదిపచ్చడీ, వేసవి బారునా చేసుకునే పచ్చిపులుసూ, వానల్లో కాచుకునే మిరియాల రసమూ… అన్నీ ఆరోగ్యదాయ కాలే… చింతతో నిశ్చింతగా చేసుకోగలిగే వంటకాలే.

అయితే చింతపండుతో ఉప్పు వాడకం కూడా పెరుగుతుంది. కాబట్టి- బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లు చింతపండుని తగు మోతాదులో వాడటమే మేలు.

Show More
Back to top button