HEALTH & LIFESTYLE

మగవాళ్లు తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!

ఈ రోజుల్లో చాలామంది మగవాళ్లు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. గత పదిహేను ఏళ్లల్లో ఈ సమస్య మరింత పెరిగినట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అసలీ సమస్య ఎందుకొస్తుంది? దీనికి చెక్ పెట్టేదెలా? అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ సమాచారం మొత్తం చదవాల్సిందే. మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది.

దీనికి చాలా కారణాలుండొచ్చు. జన్యు పరమైన కారణాలతోపాటు హార్మోనల్ ఇంబాలెన్స్, రోజూ మనం జీవించే జీవనశైలి, యాంటీ-స్పెర్మ్ యాంటీబాడీస్, కొన్నిరకాల ఇన్ఫెక్షన్ల వంటి కారణాలు కూడా ఉంటాయి. వీటితోపాటు స్మోకింగ్, డ్రింకింగ్, ఇతర ఆహారపు అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. అయితే లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిన వాళ్లు కొన్ని ఫుడ్స్‌తో దాన్ని సరిచేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.అవి ఏంటంటే..

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే విటమిన్లు, మినరల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా  ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఉన్నవాళ్లు కాయగూరలు ఎక్కువగా తినాలి. క్యాబేజీ, క్యారెట్, పాలకూర, మునగాకు వంటి వాటిలో ఏ, సీ, ఈ, కె విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

అదే విధంగా ఆకుకూరల్లో ఉండే ఫోలేట్(విటమిన్ బీ9) వీర్యకణాల్లో డీఎన్‌ఏ వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇవి మన రోజూవారి జీవనంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎంతోమంచిదని వైద్యులు అంటున్నారు.

ఇవే కాకుండా  స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు హెల్దీ ఫ్యాట్స్ కూడా ముఖ్యమే. దీనికోసం నెయ్యి, బటర్, పాలు వంటివి తీసుకోవడంతోపాటుగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు, నట్స్ వంటివి కూడా తీసుకోవాలి. వీటిలో ఉండే జింక్.. టెస్టోస్టిరోన్ హార్మోన్‌ను పెంచేందుకు తోడ్పడుతుంది.

Show More
Back to top button