HEALTH & LIFESTYLE

సంతానం కలగకపోవడానికి.. ఇవే కారణాలు

ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. సాధారణంగా పురుషుల్లో 55 సంవత్సరాల దాకా నాణ్యమైన శుక్రకణాల వృద్ధి, ఉత్పత్తి ఉంటుంది. స్త్రీల్లో నాణ్యమైన అండాల వృద్ధి, ఉత్పత్తి 35 సంవత్సరాల వరకు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత వయసు పెరుగుదల కారణంగా వారి సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుంది. కానీ, ఈ మధ్యకాలంలో తక్కువ వయసున్న వారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్న సంఖ్య పెరుగుతోంది. ఇందుకు స్త్రీ, పురుషుల్లో కారణాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషుల్లో

* పని ఒత్తిడి కారణంగా ఆల్కహాల్, సిగరేట్ వంటివి అలవాటు చేసుకోవడం. పొగ తాగటం వల్ల శరీరంలో విడుదలయ్యే నికోటిన్ శుక్రకణాలను నాశనం చేస్తుంది. శుక్రకణాల ఉత్పత్తి‌ని తగ్గిస్తుంది.
* శరీరంలో వేడి శుక్రకణాల వృద్ధిని అడ్డుకుంటుంది. ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయడం వల్ల కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది.
* నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం.
* టెస్టోస్టిరాన్ హార్మోన్ల విడుదల తక్కువగా ఉండటం.

మహిళల్లో

* ఎక్కువగా వ్యాయామాలు చేస్తే మహిళల్లో.. స్త్రీల హార్మోన్ (ఈస్టోజన్‌) బదులుగా టెస్టోస్టిరాన్ విడుదల అవుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దీని వల్ల కూడా స్త్రీలు గర్బం దాల్చే అవకాశాలు తగ్గుతాయట.
* శరీరంలో వేడి ఎక్కుగా ఉంటే ఫలదీకరణకు సాధ్యం కాదు.
* పొగ తాగటం వల్ల అందులోని నికోటిన్ అనే పదార్థం స్త్రీలలో అండాల విడుదలను అండుకుంటుంది.
* ఓవులేషన్ డిసార్డర్స్, ఎండోమెట్రియోసిస్, అకాల ఓవరీయన్ వైఫల్యం, గర్భాశయ ఫైబ్రాయిడ్లు వంటి పరిస్థితులు కూడా స్త్రీలలో గర్బధారణను అడ్డుకుంటాయి.
* ఫెలోపియన్ ట్యూబ్‌లలో అండాలు అడ్డుపడటం.

Show More
Back to top button