
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్‌లో బోలెడు పోషకాలు ఉంటాయి. సమ్మర్ లో చాలామందికి ఇదే ఫేవరెట్ డ్రింక్. అయితే చాలామందికి కొబ్బరినీళ్లు పట్లు కొన్ని సందేహాలు అయితే ఉంటాయి.. అవే.. కొబ్బరి నీళ్లు తాగడానికి సమయం అంటూ ఉందా? ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు ఈ నీళ్లు తాగకూడదు? అయితే దీనిపై క్లారిటీ కోసం ఈ ఆర్టికల్ చదివేద్దాం.
సాధారణంగా ఈ నీరు తాగితే డీహైడ్రేషన్, ఎండ వేడి తగ్గడంతో పాటు బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి పానియం. అయితే ఈ కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే పొద్దునే తాగడం మంచిది. దీనివల్ల ఏం జరుగుతుందంటే.. శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజం ఆ టైంలో పెరుగుంది.
ఇక కొంతమంది వ్యక్తులకు కొబ్బరి నీరు మంచిది కాదు. రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్న వారు కొబ్బరి నీరుకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కొబ్బరి నీరులో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది అప్పటికే అధిక పొటాషియం (హైపర్కలీమియా) ఉన్నవారు ఇది తాగితే పొటాషియం స్థాయి మరింత పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.
అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు కూడా కొబ్బరి నీళ్లు తీసుకోవద్దు.. ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయని రోగుల శరీరంలో పొటాషియం సరిగా బయటకు పోదు. వీరికి కొబ్బరి నీరు తాగడం పొటాషియం నిల్వను మరింత పెంచుతుంది. ఇది ప్రమాదకరం.