HEALTH & LIFESTYLE

ఉగాది పచ్చడితో ఎంతో ఆరోగ్యం..!

ఉగాది పచ్చడిలో ఆరోగ్యం అందరికీ జనవరి 1న నూతన సంవత్సరం ప్రారంభం అయితే.. తెలుగు ప్రజలకు మాత్రం ఉగాదికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ రోజున తెలుగువారు అందరూ ఉగాది పచ్చడి తాగడం విశేషం. ఈ పచ్చడిలో ఫేడ్ రుచులు అంటే 6 రకాల రుచులు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి.

*వేప పువ్వు: పచ్చడిలో వేప పువ్వు వేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనితో పాటు ఋతు మార్పు వల్ల పిల్లల్లో కలిగే కలరా, మలేరియా, అమ్మవారు రాకుండా సహాయపడుతుంది. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇది యాంటీ వైరస్‌లా పనిచేస్తుంది.

*మామిడి: పచ్చడితో మామిడి ముక్కలు వేస్తారు. ఇందులో తీపి, పులుపుతో పాటు వగరు కూడా ఉంటుంది. మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో చర్మాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. దీనితోపాటు మనిషిలో ఆలోచన శక్తిని కూడా పెంచుతుంది.

*చింతపండు: పులుపు కోసం చాలామంది చింతపండుని వాడుతారు. దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.

*బెల్లం: బెల్లంలో పోటాషియం, మెగ్నిషియం, ఐరన్లు ఉంటాయి. బెల్లం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు గుండెకు బలం చేకూరుస్తుంది.

*ఇక పచ్చడిలో వాడే ఉప్పు, కారం వల్ల సహజంగానే శరీరానికి మంచి కలుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తప్పకుండా ఉగాది రోజున తీసుకోండి.

Show More
Back to top button