ఇంటి అందం కోసం పెంచే కొన్ని మొక్కల్లో మన ఆయుష్యుని పెంచే గుణాలు ఉంటాయి. వాటిలో వాము మొక్క ఒకటి. ఇది చూడటానికి అందంగా ఉండి, మంచి పరిమళాలు వెదజల్లుతుంది. వాము మొక్క గాలి పీల్చితే మన ఆరోగ్యానికి మంచిది. దీంతో పచ్చడి, బజ్జిలు చేసుకుంటుంటారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు.
దగ్గు, జలుబు తగ్గించేందుకు వాము ఆకు బాగా పని చేస్తుంది. 10-12 ఆకులు శుభ్రం చేసి, ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని రోజుకు 2సార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. అవసరం అనుకుంటే అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. దీంతో జీర్ణ సమస్యలు రావు. వాము నీరు పుక్కిలిస్తే నోటిలో బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు, దంతాలు దృఢంగా ఉంటాయి. గాయాలను మాన్పించే మందుగా కూడా వాము ఆకు ఉపయోగపడుతుంది.
వాము ఆకు ప్రయోజనాలు
వాము ఆకులతో మరిగించిన నీరు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగి.. అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమలు, పురుగులు కుట్టిన చోట వాము ఆకుల పేస్ట్‌ను ఉంచితే నొప్పి, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్దరైటిస్ నొప్పులు ఉన్నవారు ఈ ఆకును లేపనంగా చేసి నొప్పి ఉన్న చోట కట్టుకడితే నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: గర్భిణులకు, పాలిచ్చే బాలింతలకు వీటిని తినిపించకూడదు. గర్భిణులు వీటిని తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. పుట్టబోయే బిడ్డకు నష్టం కలిగిస్తుంది.