HEALTH & LIFESTYLE

ఏ నూనెతో వంట చేస్తున్నారు?

భారతీయ వంటకాల తయారీలో వంట నూనె చాలా ప్రధానమైనది. ప్రస్తుతం మార్కెట్లో హార్ట్ హెల్తీ, హెల్తీ, డబుల్ రిఫైండ్, రిఫైండ్, ఫిల్టర్ వంటి వివిధ పద్ధతుల్లో తయారు చేసిన నూనెలు ఉన్నాయి. మనం మార్కెట్‌లో కొనే రిఫైండ్ ఆయిల్స్ డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, డియోడరైజింగ్ అనే నాలుగు స్టేజ్‌లో తయారవుతాయి. రిఫైండ్ నూనెల తయారీలో పూర్తిగా గింజలనే వాడతారని ఏం లేదు. పెట్రోలియం బైప్రాడక్ట్ అయిన పాలిమర్ ఆయిల్స్ నుంచి కూడా రిఫైండ్ ఆయిల్ తయారు చేస్తారు. నూనెలు మన శరీరానికి అవసరమైన క్యాలరీలు, కొవ్వులు అందిస్తాయి. అలాగే విటమిన్-D, E , K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు శరీరం గ్రహించేందుకు సహాయపడతాయి. నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాట్స్ మెదడు అభివృద్ధికి, హార్మోన్ల ఉత్పత్తికి, కణజాలం వృద్ధికి, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ, అన్నీ రకాల నూనెలు ఈ ప్రయోజనాలను ఇవ్వవంటున్నారు నిపుణులు.

 రిఫైండ్ ఆయిల్ వాడితే అనారోగ్య సమస్యలు

వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనె, ఆవనూనె, బీన్, మొక్కజొన్న నుంచి తయారు చేసిన రిఫైండ్ నూనెలు ఆరోగ్యానికి హాని చేస్తాయని న్యూట్రిషన్స్ హెచ్చరిస్తున్నారు. వంటనూనె అతిగా వేడి చేసినప్పుడు విషతుల్యంగా మారుతుంది. రిఫైండ్ ఆయిల్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. కాబట్టి, ఇందులోని పోషకాలు నాశనం అవుతాయి. దాదాపు 250 సెల్సియస్ డిగ్రీల వద్ద వేడి చేసి వాసనని పోగొడతారు. ఈ నూనెలు వాడితే ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో HDL(మంచి కొవ్వులు) పరిమాణం తగ్గుతుంది.

దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రిఫైండ్ ఆయిల్స్ రోజూ వాడితే క్యాన్సర్, డయాబెటిస్ మెల్లిటస్, జీర్ణశయ సమస్యలు, అథెరోస్క్లెరోసిస్, ఊబకాయం, పునరుత్పత్తి, కాలేయ, రోగనిరోధక సమస్యలు, మతిమరుపు, త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడం, శరీరంలో వాపు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచుతాయి.  
 
నూనె మంచిది?

గతంలో ఈ రిఫైండ్, హెల్తీ, డబుల్ రిఫైండ్ ఆయిల్స్ ఏవి ఉండేవి కాదు. గానుగలో ఆడించిన నూనెలను తయారు చేసేవారు.
కోల్డ్ ప్రెస్డ్ అనేది నూనె తయారీలో ఉన్న మరో పద్ధతి. ఇందులో వేడి చేయకుండానే ఆహార పదార్థాల నుంచి ఫైబర్‌ని వేరు చేసి ఆయిల్ తీస్తారు. దీంతో అందులోని పోషకాలు అలాగే ఉండిపోతాయి. వేడి, రసాయనాల వాడకంతో చేసిన నూనెలతో పోల్చితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ పద్ధతి ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెందింది. కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తయారు చేసిన నూనెల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-E వంటి పోషకాలు శరీరంలోని అనేక అనారోగ్య లక్షణాలను నయం చేస్తాయి.

* కోల్డ్ ప్రెస్డ్ నూనె చర్మాన్ని పొడిబారకుండా ఉంచుతుంది. ఈ నూనెలో విటమిన్-E, యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున మొటిమలను తగ్గిస్తుంది.

* డయాబెటిస్ ఉన్నవారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోవడం ఉత్తమం. దానిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

* కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి సహాయపడుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు ఈ నూనెను వంటలో ఉపయోగించడం మంచిది.

* అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

Show More
Back to top button