
సాధారణంగా వయసు, ఎత్తు బట్టి బరువు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఓవర్ వెయిట్ అని అంటాము. అయితే.. ఈ ఓవర్ వెయిట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి.
ఒకటి కండ ఎక్కువగా ఉండడం వల్ల పెరిగే బరువు.మరోకటి ఎక్కువగా కొవ్వు ఉన్న ఆహారం తినడం వల్ల పెరిగే బరువు. కొవ్వు వల్ల పెరిగే బరువునే భారీకాయం అని అంటారు. వివరంగా చెప్పాలంటే.. పోషకాలు తక్కువ ఉండి, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు అది కరగడానికి తగిన శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. లేదంటే, క్యాలరీలు కొవ్వులా మారి.. ముందుగా పొట్ట భాగంలో చేరుతుంది.
తర్వాత మెల్లగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ఇది ఇప్పటి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం బయటి ఆహారాన్ని తినిడంలో ఆపకపోవడం. అయితే, దీనికి డయాబెటిక్‌కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారా..? అదేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే.. అండి నేను మీ డా. సుధీర్ రెడ్డి wishealth లైఫ్ స్టైల్ క్లీనిక్స్ హైదరాబాద్.
ఇక మ్యాటర్‌లోకి వెళ్తే..
చిన్న పిల్లలో సడెన్‌గా బరువు పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. అప్పుడు ఏమైంతుందంటే.. ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ ఉత్పత్తి కావడం వల్ల ఆ గ్లూకోజ్‌ను శక్తిగా మర్చే.. ఇన్సులిన్ పనిలో మార్పులు వస్తాయి.
దీనివల్ల ఇన్సులిన్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం చేత రక్తంలో గ్లూకోజ్(షుగర్) స్థాయిలు పెరిగిపోయి.. డయాబెక్స్గా మారుతుంది. కాబట్టి క్వాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే.. ఇప్పుడే స్క్రీన్ మీద కనింపించే నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.