TRAVEL ATTRACTIONS

ప్రకృతి ఒడిలో పరవశింపజేసే.. హొగెనక్కల్‌కు వెళ్ధామా?

త్వరలో దసరా సెలవులు రానున్నాయి హొగెనక్కల్‌ ఈ సెలవుల్లో ఎంజాయ్ చేయాలంటే తమిళనాడులోని హొగెనక్కల్ వెళ్ళాల్సిందే. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు. మనసును పరవశింపచేసే ప్రకృతి అందాల జోరు.

ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే అందాల జలపాతం హొగెనక్కల్‌.

దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించని ఈ జలపాతానికి కి.మీ. దూరంనుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది.

భారత నయాగరా జలపాతంగా పిలిచే ఈ జలపాతం అందాలను వానాకాలంలో చూసిన వారెవ్వరైనా ఆనందంతో తడిసిముద్దయిపోతారు.

ఇక్కడి రెండు కొండలు ఒకే కొండ రెండుగా మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది.

ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. ఇవన్ని కూడా హొగెనక్కల్‌లో అనుభవించాల్సినవే!  

* బెంగళూరు లేదా చెన్నై నుంచి రోడ్డు/రైలు మార్గంలో వెళ్తే 4 గంటల్లో ఇక్కడకు చేరుకోవచ్చు.
* ఈ ట్రిప్‌కు దాదాపు ఒక వ్యక్తికి రూ.2వేలు నుంచి రూ.3వేలు వరకు ఖర్చు అవుతుంది.
* జలపాతాల సమీపంలో అనేక చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు ఉంటాయి.

ఇక్కడ ఫిష్ ఫ్రై, వెదురు చికెన్, మటన్ కర్రీ వంటి స్థానిక రుచికరమైన వంటకాలను అందుబాటులో ఉంటాయి.

హోగెనక్కల్‌లో రెండు నుంచి మూడు రోజులు ఉండాలంటే చుట్టుపక్కల అనేక చిన్న గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీలు కూడా ఉంటాయి.

Show More
Back to top button