TRAVEL ATTRACTIONS

నవంబర్‌లో కచ్ భలే ఉంటుందట..!

భారత్‌లోని ఏ కోణం చూసిన ప్రకృతి అందచందాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా ఎన్నో ప్రదేశాలు తమ అందాలతో పర్యాటకులని ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సమయంలో ఏ ప్రదేశానికి వెళ్లాలి..? అనే ప్రశ్న తలెత్తితే కచ్‌(KACHCH)కి వెళ్లమని చెబుతారు పర్యాటక ప్రేమికులు. కచ్ పేరు వినడానికి వింతగా ఉన్నా చూడడానికి రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదేమో. ఇది గుజరాత్‌లోని ఒక జిల్లా. ఇక్కడికి వెళ్లడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మంచి సమయంగా చెప్పవచ్చు.

దీనిని ముఖ్యంగా 5 భాగాలుగా విభజించి టూర్ ప్లాన్ చేసుకుంటే.. అన్ని ప్రదేశాలను కవర్ చేయవచ్చు. అవేంటంటే.. వైట్ రన్, బుజ్, ధోలవీర, వెస్ట్ కచ్, మాండ్వీ. వీటన్నిటిని చూడడానికి ముందుగా కచ్ చేరుకోవాలి. దీనికోసం ముందుగా బుజ్‌కి వెళ్లాలి. తెలుగు రాష్ట్రాల నుంచి విమానం, రైలు లేదా బస్సు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ ఒకటి నుంచి రెండు రోజుల వరకు గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రింద చెప్పిన ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి.

*ప్రగ్ మహాల్

*ఐన మహాల్

*ది రాయల్ ఛతర్దీస్

*బుజియో హిల్ & ఫోర్ట్

*ఖారీ నది

*వందేమాతరం మోమోరియల్

*హిరలక్ష్మి క్రాఫ్ట్ పార్క్

*కచ్ మ్యూజియం

*ఫోక్ ఆర్ట్ మ్యూజియం

*స్వామినారాయణ టెంపుల్

బుజ్ తర్వాత వైట్ రన్ రీజియన్ ప్రదేశాన్ని కవర్ చేద్దాం. ఇక్కడ మీరు తెల్ల ఎడారిని చూస్తారు. అచ్చం మంచులా కనిపించే ఈ ప్రదేశం పాకిస్తాన్‌కు 25 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా కనీసం ఒకటి నుంచి రెండు రోజులు నివసించేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ రీజియన్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. 

*వైట్ రన్

*నిరొన విలేజ్

*కలో దుంగర్

*మాగ్నెటిక్ ఫీల్డ్

*దత్తాత్రేయ టెంపుల్

*ఇండియా బ్రిడ్జ్

*BSF వార్ మెమోరియల్

*ఇండియా-పాకిస్తాన్ బోర్డర్

*కావ్డా విలేజ్

*లుడియా విలేజ్

వైట్ రన్ రీజియన్ తర్వాత మాండ్వీ చేరుకోవాలి. దీనిని సులువుగా ఒక్కరోజులో పూర్తిగా సందర్శించవచ్చు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు. 

*విజయ విలాస్ ప్యాలెస్

*శ్యాంజీ కృష్ణ మెమోరియల్

*మాండ్వీ బీచ్

*72 జినలాయ టెంపుల్

మాండ్వీ తర్వాత మీరు చేరుకోవాల్సిన ప్రదేశం వెస్టర్న్ కచ్. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలేంటంటే..

*లఖ్‌పత్ ఫోర్ట్

*లఖ్‌పత్ గురుద్వారా

*కోటేశ్వర మహాదేవ్ టెంపుల్

*నారాయణ సరోవర్ లేక్  

వెస్టర్న్ కచ్‌లో చూడవలసిన ప్రదేశాలు పూర్తైన తర్వాత కచ్‌లో చివరగా వెళ్లాల్సిన రీజియన్ ‘ధోలవీర’. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే..

*హరప్పా

*అర్కియోలాజికల్ మ్యూజియం

*ఫోజిల్ పార్క్

*చిపర్ పాయింట్

టూర్ బడ్జెట్..

*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం మీ ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది.

*ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది. ఒకవేళ రెస్టారెంట్స్‌కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. 

*వివిధ ఎంట్రీ టికెట్లకు రూ.2000 వరకు అవుతుంది.

*గుజరాత్‌లో చాలా రకాల హస్త కళలు కనిపిస్తాయి. వాటిని కొనాలనుకుంటే షాపింగ్ కోసం ఎక్కువ డబ్బు తీసుకెళ్లండి.

*నివసించడానికి రూంకు ఒకరోజుకు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చవుతుంది.

*చివరగా అనుకోని ఖర్చు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, మరికొంత డబ్బు తీసుకెళ్లండి.

Show More
Back to top button