
ఒక మరపురాని అనుభవం కలిగించే ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? అయితే అగర్తలను మీ బక్కెట్ లిస్ట్‌లో చేర్చండి. ఇది ఈశాన్య భారతదేశంలో ఒక దాగి ఉన్న రత్నంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడి అందాలను చూడటానికి రెండు కనులు సరిపోవు. ఈ ప్రదేశానికి వెళ్లడానికి ఉత్తమ సమయం శీతాకాలం, అక్టోబర్ నుండి మార్చి వరకు అని చెబుతున్నారు పర్యాటకులు.
ఈ సమయంలో ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది త్రిపుర రాజధాని. హౌరా నది ఒడ్డున, బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉండే ఈ నగరానికి చేరుకోవడానికి రోడ్డు, విమానం లేదా రైలులో ప్రయాణించవచ్చు. మొత్తం పర్యటనను పూర్తి చేయడానికి దాదాపు 3 నుండి 4 రోజులు పడుతుంది.
అగర్తలాలో సందర్శించవలసిన ప్రదేశాలు
* ఉజ్జయంత ప్యాలెస్
* సెపాహిజాలా వన్యప్రాణుల అభయారణ్యం
* త్రిపుర ప్రభుత్వ మ్యూజియం
* నీర్మహల్ ప్యాలెస్
* జంపూయ్ కొండ
* హెరిటేజ్ పార్క్
* కమలేశ్వరి ఆలయం
* ఉనకోటి రాతి శిల్పాలు
* దుర్గాబరి టీ ఎస్టేట్
మీరు ఎంచుకున్న రవాణా, హోటళ్ల అనుగుణంగా మీ పర్యటనా బడ్జెట్‌ను ప్లాన్ చేయండి.

