TRAVEL

అండమాన్ టూర్ ఓ భూతల స్వర్గం

లక్ష ఖర్చైనా రచ్చ చేయాలి అనుకునే వారికి అండమాన్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్‌గా చెప్పవచ్చు. సోలో ట్రిపుకు కాని, హనిమూన్‌కి గాని దీనిని చక్కటి ప్రదేశంగా చెప్పవచ్చు. ఇది భారతదేశపు దీవి. ఈ దీవి మన దేశం నుంచి 1260 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి విమానం లేదా షిప్‌ రవాణాలే ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ నుంచి అండమాన్‌కి డైరెక్ట్ ఫ్లైట్‌లు అందుబాటులో ఉన్నాయి. లేదా వైజాగ్, చెన్నై నుంచి అండమాన్‌కు షిప్ ద్వారా కూడా వెళ్లవచ్చు.

కానీ, ఈ ప్రయాణం 3 రోజులు ఉంటుంది. దీని కాస్ట్ కూడా విమాన ప్రయాణం కంటే ఎక్కువే అవుతుంది. కాబట్టి విమానంలో అండమాన్ చేరుకోవడం బెటర్ అని అంటున్నారు పర్యాటకులు. అండమాన్‌లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. దీని తర్వాత బెంగాలీ మాట్లాడుతారు. అండమాన్ సందర్శించడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మంచి సమయమని చెప్పవచ్చు. 

అండమాన్ చేరుకున్న తర్వాత మీరు టాక్సీ బుక్ చేసుకుని హోటల్‌కి చేరుకోవచ్చు. ఓల్డ్ మార్కెట్ ఏరియాలో కొంచెం తక్కువకు రూంలు లభిస్తాయి. ఇక్కడ తిరగడానికి బైకులు కూడా రెంటుకు అందుబాటులో ఉంటాయి. అండమాన్‌లో చూడవలసిన ప్రదేశాలేవో ఒక్కసారి లుక్ వేద్దామా..?

హవ్‌లాక్ దీవి

సెల్యూలర్ జెైల్

కర్బిన్‌స్కో బీచ్

నీల్ దీవి

రోజ్ ఐలాండ్

నార్త్ బె ఐలాండ్

బారతంగ్ ఐలాండ్

వైపర్ ఐలాండ్

మైండ్ హర్రీట్ నేషనల్ పార్క్

చిడియ తాపు

రంగట్

మాయా బందర్

డిగ్లిపూర్

పంచవతి వాటర్ ఫాల్

గిటార్ ఐలాండ్

ఖర్చు ఎంత అవుతుంది..?

మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.

మనిషికి రోజుకు ఆహారానికి రూ.600 నుంచి రూ.800 వరకు అవుతుంది.

రూంకు డిమాండ్‌ బట్టి రూ.1500 నుంచి రూ.5000 వరకు ఉంటుంది.

వాటర్ యాక్టివిటీస్‌కు మొత్తం కలిపి రూ.12500 వరకు అవ్వొచ్చు. 

బైక్ రెంట్‌కి తీసుకుంటే రోజుకు రూ.500 అవుతుంది.

క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకుంటే రోజుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు కావొచ్చు. 

వివిధ ఎంట్రీ టికెట్లకు దాదాపు రూ.1000 వరకు అవుతాయి. 

షాపింగ్ చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Show More
Back to top button