TRAVEL

దక్షిణ ద్వారక.. ఓ ఎమోషన్

గురువాయూర్ ఆలయం కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోని ఉంది. ఇది దక్షిణ ద్వారకగా కూడా పేరుగాంచింది. ఈ ప్రదేశానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకుంటే.. త్రిసూర్ స్టేషన్‌‌‌కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. త్రిసూర్ నుంచి గురువాయూర్ 30 కి.మీ దూరంలో ఉంటుంది. త్రిసూర్ స్టేషన్ నుంచి గురువాయూర్ వెళ్లేందుకు బస్సులు ఉంటాయి. గురువాయూర్ బస్సు స్టేషన్ నుంచి ఆలయం 800 మీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లైట్ మార్గంలో గురువాయూర్ వెళ్లాలని అనుకునేవారు కొచ్చి విమానాశ్రయంకి చేరుకోవాలి. కొచ్చి ఎయిర్ పోర్ట్ నుంచి గురువాయూర్ 80 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడికి క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు.

గురువాయూర్ ఆలయం విశిష్టత ఏంటంటే.. దక్షిణ ద్వారకాగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అని పిలవబడుతున్నాడు. ఇక్కడ స్వామి బాలకృష్ణుడు రూపంలో దర్శనమిస్తాడు. అందుకే స్వామిని ఉన్ని కృష్ణన్, ఉన్ని కన్నన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని త్రిమూర్తులు పూజించేవారని.. ఈ విగ్రహం చాలా అరుదైన పాతాళ శిలతో తయారయ్యిందని చెబుతుంటారు. అంతేకాకుండా, ఈ విగ్రహం 5వేల సంవత్సరాల నాటిదని సమాచారం. ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణుని శిష్యుడైన ఉద్ధవుడు.. శివుని ఆదేశాల మేరకు వాయుదేవుడు, బృహస్పతి సాయంతో కేరళ తీరం సమీపంలో ప్రతిష్టించారు. ఇక్కడ ఎక్కువగా భక్తులు చిన్నపిల్లలకి అన్నప్రాసన చేస్తుంటారు. 

గురువాయూర్‌లో చూడవలసిన ప్రదేశాలు

* మమ్మియూర్ మహా దేవాలయం

* పున్నతూర్ కోట ఏనుగుల శిబిరం 

* పార్థసారథి ఆలయం 

* తిరు వెంకట చలపతి ఆలయం

* చాముండేశ్వరి ఆలయం

* చవకాడ్ బీచ్ 

గురువాయూర్ టూర్ బడ్జెట్..!

*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.

*మనిషికి రోజుకు ఆహారానికి రూ.600 నుంచి రూ.800 వరకు అవుతుంది.

*రూంకు డిమాండ్‌ బట్టి రూ.1000 నుంచి రూ.3000 వరకు ఉంటుంది.

*క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకుంటే రోజుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు కావొచ్చు. 

*వివిధ ఎంట్రీ టికెట్లకు దాదాపు రూ.1000 వరకు అవుతాయి. 

*షాపింగ్ చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Show More
Back to top button