TRAVEL

ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్‌కి వెళ్దామా..?

పూర్వకాలంలో ఉజ్జయినిని అవంతి అని పిలిచేవారు. భోజరాజు, భట్టి విక్రమార్క లాంటి గొప్ప మహారాజులు పాలించిన అతి పురాతన నగరం ఇది. ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఉజ్జయిని ఒకటి. మహా శివుడి 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశం ఇది. అష్టమహా దశ శక్తి పీఠాలలో మహాకాళీ శక్తి పీఠం ఉన్న ప్రదేశం కూడా ఇదే. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన ‘సాందీప్ ఆశ్రమం’ ఉజ్జయినీలోనే ఉంది.

అంగారక గ్రహం జన్మించిన ప్రదేశమైన మంగళనాథ్ ఆలయం కూడా ఇక్కడే ఉంది. మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో.. ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో భోపాల్ నుంచి 192 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ వారాంతపు ప్రత్యేకమైన ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ లభించకపోతే ఇండోర్ లేదా భోపాల్ వరకు ట్రైన్‌లో వెళ్లి అక్కడ నుంచి మరో ట్రైన్ లేదా బస్సులో ఉజ్జయినికి చేరుకోవచ్చు. ఫ్లైట్ మార్గంలో ఉజ్జయినికి వెళ్లాలంటే.. ఇండోర్‌లో ఉన్న దేవీ అహల్యాభాయ్ హోల్కర్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి క్యాబ్ ద్వారా వెళ్లవచ్చు. దేశంలో జరిగే 4 కుంభమేళాల్లో ఒకటి ఇక్కడే నిర్వహిస్తారు.

ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాలు..

*కాల భైరవ మందిరం
*కుంభమేళా
*రామ్ ఘాట్
*కాలియాదే ప్యాలెస్‌
*హరసిద్ధి ఆలయం
*పీర్ మత్స్యేంద్రనాథ్
*ఇస్కాన్ ఆలయం
*జంతర్ మంతర్
*భర్తిహరి గుహలు
*భారత మాత ఆలయం
*మంగళనాథ్ ఆలయం

ఉజ్జయిని టూర్ బడ్జెట్..!

*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది.
*మనిషికి రోజుకు ఆహారానికి రూ.600 నుంచి రూ.800 వరకు అవుతుంది.
*రూంకు డిమాండ్‌ బట్టి రూ.1500 నుంచి రూ.5000 వరకు ఉంటుంది.
*క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకుంటే రోజుకు రూ.1000 నుంచి రూ.2500 వరకు కావొచ్చు.
*వివిధ ఎంట్రీ టికెట్లకు దాదాపు రూ.1000 వరకు అవుతాయి.
*షాపింగ్ చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Show More
Back to top button