HEALTH & LIFESTYLE

కొబ్బరి పాలలో ఉండే పోషకాలు ఏంటో తెలిస్తే.. షాక్ అవుతారు!

పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లతో ఎన్ని పోషకాలు అందుతాయో.. అంతకు ఏమాత్రం కొబ్బరి పాలు తీసిపోవు. తురిమిన పచ్చి కొబ్బరిలో కాస్త నీరు పోసి మిక్సీలో పట్టి వడబోసి కొబ్బరి పాలు తయారు చేయవచ్చు. కొబ్బరి పాలలో C, E, B1, B3, B5, B6 విటమిన్లు ఉంటాయి. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లవణాలు అధికమే. ఈ పాలు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం.

* ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. ఇందులో కాల్షియం, భాస్వరం అధికంగా ఉంటాయి.

* కొబ్బరి పాలల్లో కొవ్వును కరిగించే లక్షణాలు ఉంటాయి. ఇందులోని లారిక్ ఆమ్లం చెడు కొవ్వును కరిగించి, మంచి కొలెస్ట్రాల్ పరిణామం పెంచుతుంది.

* కొబ్బరి పాలలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. శరీరంలోని వైరస్, బ్యాక్టీరియాతో పోరాడటానికి ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

* కొబ్బరి పాలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి కండరాలకు మంచిది.

* కొబ్బరి పాలతో 5నిమిషాలు జుట్టుకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా అవుతుంది.

* ఆర్దరైటిస్ చికిత్స కొబ్బరి పాలలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పి, ప్రోస్టేట్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Show More
Back to top button