
ఇప్పటి జీవితంలో స్మార్ట్‌ఫోన్ మన చేతికి అంటిపెట్టుకున్న గ్యాజెట్. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం ఇలా రోజు క్షణం విడవకుండా ఫోన్ చూస్తూనే ఉంటాం. ఇది మామూలుగా అనిపించినా, దీని వల్ల మెదడు మీద వచ్చే ప్రభావం దీర్ఘకాలంలో చాలా డేంజరస్. న్యూయార్క్ యూనివర్సిటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల రీసెర్చ్‌ల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ యాడిక్షన్ మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తూ, మెదడు పనితీరులో మార్పులు తీసుకురాగలదు.
మెదడుపై కనిపించే మొదటి మార్పులు ఇవే:
ఫోకస్ తగ్గిపోవడం మెదడు ఒకే పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోతుంది. చిన్న చిన్న డిస్ట్రాక్షన్లకే రెస్పాండ్ చేస్తుంది. చదువు, జాబు వంటి పనుల్లో దీర్ఘకాల ఫోకస్ తగ్గిపోతుంది.
మెమరీ వీక్ అవ్వడం ఫోన్ మేము ఆలోచించాల్సిన విషయాలన్నీ జ్ఞాపకం పెట్టేస్తుంది. ఫలితంగా మెదడు యాక్టివ్‌గా పని చేయక, మతిమరుపు లాంటి లక్షణాలు త్వరగా కనిపించొచ్చు.
డోపమైన్ అలవాటు ఫోన్ స్క్రీన్ చూస్తూనే మైండ్ ఫన్ ఫీలవుతుంది. ఇది ‘డోపమైన్’ అనే కెమికల్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. దానివల్ల మెదడు సరదా పొందే పనులకే అలవాటు పడుతుంది. సీరియస్ పనులు బోర్ అనిపించడం మొదలవుతుంది.
నిద్ర డిస్టర్బ్ అవ్వడం నిద్రకి ముందు ఫోన్ చూస్తూ ఉంటే మెదడులో మెలటొనిన్ అనే నిద్ర హార్మోన్ బయటపడడం తగ్గిపోతుంది. దీంతో నిద్ర సరైనంత వేగంగా రాదు. అది మెదడు రిపేర్ టైమ్‌ను తగ్గిస్తుంది.
ఎమోషనల్ ఇన్ బ్యాలెన్స్ ఫోన్ ద్వారా వచ్చే నోటిఫికేషన్స్, న్యూస్, సోషల్ మీడియా పోస్ట్‌లు మానసిక స్థితిని తేడా చేయగలవు. కొంతమందిలో అలసట, ఒత్తిడి, అసహనం పెరుగుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ కూడా దీని వల్ల పెరగవచ్చు.
ఇప్పుడు చేయాల్సింది ఇదే రోజులో ఫోన్ వాడే టైమ్‌ను స్పష్టంగా ప్లాన్ చేసుకోవాలి. సోషల్ మీడియా యాప్‌లను పరిమితంగా వాడాలి. నిద్రకి ముందు కనీసం 1 గంట ముందు ఫోన్ దూరం పెట్టాలి. రోజులో 1–2 గంటలు ఫోన్ లేకుండా గడపడం మెదడుకు పెద్ద రిలీఫ్. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ… మనం దాని కంట్రోల్‌లో ఉండకూడదు.










