HEALTH & LIFESTYLE

మల్టీవిటమిన్లు వాడే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రస్తుత తరం జీవనశైలి వేగంగా మారుతోంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది శరీరానికి పోషకాలు అందించడానికి డాక్టర్ సలహా లేకుండానే మల్టీవిటమిన్ టాబ్లెట్‌లు వాడుతున్నారు. కానీ, ఇలా ఇష్టం వచ్చినట్లు మల్టీవిటమిన్లు వాడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మల్టీవిటమిన్లు అంటే ఏమిటి?

విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్, సి, డి, ఇ, కే వంటి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను కలిపి తయారు చేసిన టాబ్లెట్లను మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అంటారు. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం కోసం వీటిని వాడతారు.

మల్టీవిటమిన్లు వాడటం వల్ల కలిగే సమస్యలు

విటమిన్ ఓవర్‌డోస్: మల్టీవిటమిన్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విష ప్రభావాలు కలగవచ్చు. ఉదాహరణకు, విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, తల తిరగడం, లివర్ నష్టం, దృష్టి సమస్యలు రావచ్చు. విటమిన్ డి అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. అలాగే, ఐరన్ అధికంగా తీసుకుంటే వికారం, వాంతులు, కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావచ్చు.

అలర్జీలు: కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్లలో ఉండే పదార్థాలకు కొందరికి అలర్జీలు కలగవచ్చు. దీనివల్ల చర్మంపై ర్యాషెస్, వాంతులు, ఛాతిలో ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు.

జీర్ణ సమస్యలు: ఖాళీ కడుపుతో మల్టీవిటమిన్లు తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

హార్మోన్ల అసమతుల్యత: బి-కాంప్లెక్స్ మరియు జింక్ వంటివి ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా తగ్గించవచ్చు.

ఇతర మందులపై ప్రభావం: మీరు బీపీ, షుగర్ లేదా థైరాయిడ్ వంటి వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే, మల్టీవిటమిన్లు వాటి పనితీరును తగ్గించవచ్చు. ఉదాహరణకు, కాల్షియం మందులు ఐరన్ శోషణను తగ్గించవచ్చు, విటమిన్ కె కొవ్వు కరిగించే మందులను ప్రభావితం చేయవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డాక్టర్ సలహాతోనే వాడాలి: సొంతంగా కాకుండా డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే మల్టీవిటమిన్లు వాడాలి.

అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి: మీకు ఏ విటమిన్ లోపం ఉందో తెలుసుకోవడానికి ముందుగా టెస్టులు చేయించుకోవడం మంచిది.

నిర్దేశించిన మోతాదులోనే వాడాలి: డాక్టర్ సూచించిన మోతాదుకు మించి ఎప్పుడూ వాడకూడదు.

ఖాళీ కడుపుతో తీసుకోకూడదు: ఎప్పుడూ ఆహారం తీసుకున్న తర్వాతే మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకోవాలి.

Show More
Back to top button