TRAVEL

బడ్జెట్‌లో రామేశ్వరం టూర్

చాలామంది జీవితంలో ఒక్కసారైన రామేశ్వరం వెళ్లాలనుకుంటారు. దీని కోసం చాలా రోజులు ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం ఎలా వెళ్లాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అక్కడ ఏయే ప్రదేశాలు చూడవచ్చు..? అనే విషయాలు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం చేరుకోవడానికి హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయనగరం, తిరుపతి నుంచి రైళ్లు ఉన్నాయి. ఇతర నగరాల నుంచి రామేశ్వరం వెళ్లాలంటే ముందుగా చెన్నై వచ్చి అక్కడి నుంచి మధురైకి బస్‌లో లేదా రైలులో వెళ్లవచ్చు. విమానంలో వెళ్లాలనుకునేవారు మధురైకి వెళ్లి అక్కడి నుంచి రామేశ్వరం చేరుకోవచ్చు. మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం ప్రయాణ సమయం, ఖర్చు ఆధారపడి ఉంటుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత అక్కడ ఒక రూం తీసుకుని ఫ్రెష్ అయ్యి ఆలయానికి వెళ్లవచ్చు.
 
 
*
రామేశ్వరంలో దర్శించవలసిన ప్రదేశాలు

*రామేశ్వరం
*అగ్ని తీర్థం
*ధనుష్కోడి దేవాలయం
*జఠాయు తీర్థం
*అరియమాన్ బీచ్
*పంచముఖ హనుమాన్ దేవాలయం
*లక్ష్మణ తీర్థం
*విల్లుని తీర్థం
*సిల్క్ షాపింగ్
*సీ వరల్డ్ అక్వేరియం
*అన్నై ఇందిరా గాంధీ రోడ్ బ్రిడ్జి
*అబ్దుల్ కలాం ఇల్లు
*కోదండరామ స్వామి మందిరం

* టూర్‌కి అయ్యే ఖర్చు

*హైదరాబాద్ నుంచి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.550
*వరంగల్ నుండి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.545
*వైజాగ్ నుండి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.575
*విజయవాడ నుండి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.485
*తిరుపతి నుండి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.410
*చెన్నై నుండి రామేశ్వరం రైలు (స్లీపర్ క్లాసు) టికెట్ ధర రూ.360
*సైట్ సీయింగ్‌కి రూ.1300
*రూంకు రోజుకు రూ.1200 నుంచి రూ.1800
*భోజనానికి ఒకరికి రోజుకు రూ.300 నుంచి రూ.500
*ఇతర ఖర్చు రూ.1500

దీని ఆధారంగా మీరు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button