Telugu News

ఆ ఓటమి ఎంతో ఆవేదనకు గురిచేసింది: RDO

ప్రస్తుంతం నిరుద్యోగుల చూపు అంతా గ్రూప్స్ పైనే. దానికి తోడు రాష్ట్రంలో నోటిఫికేషన్స్ రిలీజ్ కావడంతో ప్రిపరేషన్‌లో నిమగ్నం అయ్యారు. తిరుపతికి చెందిన ఎ. చైత్ర వర్షిణి. బీటెక్‌ పూర్తవుతూనే ప్రభుత్వ కొలువు దిశగా అడుగులు వేసి.. అనుకున్న లక్ష్యం సాధించిన చైత్ర సక్సెస్‌ స్టోరీ ఆమె మాటల్లోనే.. చూద్దాం. నాకు నా తల్లిదండ్రులే ఆదర్శం. నాకు బీటెక్‌ పూర్తి కాకుండానే కార్పొరేట్‌ కొలువు లభించింది. అయితే నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రలు సొసైటీకి సేవ చేసే దిశగా ప్రయత్నించమని ప్రోత్సహించారు. దీంతో గవర్నమెంట్‌ సర్వీస్‌ లక్ష్యంగా పెట్టుకుని 2015 జూన్‌లో అడుగులు ప్రారంభించాను. 2016 సివిల్స్‌ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని.. తొలి అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2017 జూన్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. కానీ.. ఆరు మార్కుల తేడాతో ఫలితం చేజారింది. తక్కువ మార్కుల తేడాతో చేజారడంతో నాకు ఎంతో ఆవేదన కలిగించింది. అయితే.. అదే సమయంలో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1లో విజయం లభించింది. ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.

విభిన్న వ్యూహాన్ని అనుసరించాను

గ్రూప్‌–1 మెయిన్స్ తర్వాత మెయిన్స్‌కు 45 రోజుల మాత్రమే ఉండడంతో ప్రిపరేషన్‌ పరంగా విభిన్న వ్యూహాన్ని అనుసరించాను. ప్రతి వారం ఒక సబ్జెక్ట్‌ చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే సమాచారాన్నే ఆధారంగా చేసుకుని ముందుకు సాగాను. నాకు మెమొరీ పరంగా ఆయా అంశాలు గుర్తుంచుకునేందుకు పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్, ముఖ్యమైన గణాంకాలు నోట్స్ చేసుకోవడం వంటి టిప్స్‌ పాటించాను. అయితే అభ్యర్థులు గుర్తించుకోవాల్సింది ముందుగా సిలబస్‌ను విశ్లేషించుకోండి. దీనికి అనుగుణంగా ప్రతి రోజు ప్రిపరేషన్‌కు కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా సమయం కేటాయించుకోవాలి.

Show More
Back to top button