Telugu Special Stories

రాకేష్ జున్‌జున్‌వాలా విజయగాథ

కేవలం రూ.5వేలతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు రాకేష్ జున్‌జున్‌వాలా. తనకు స్టాక్ మార్కెట్ పై ఉన్న ఆసక్తి ఆ స్థాయికి తెచ్చింది. తన చిన్నతనంలో తన తండ్రి స్టాక్ మార్కెట్ గురించి స్నేహితులతో మాట్లాడడం వింటూ… స్టాక్స్ గురించి తన తండ్రిని అడిగారు.. స్టాక్ గురించి తెలియాలంటే వార్తలు వినడం, చదవడం చేయాలన్నాడు. రాకేష్ రోజు వార్తలు వినేవాడు. తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లు తండ్రితో చెప్పారు. దానికి నువ్వు ముందు నీ ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి, తర్వాతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని జవాబిచ్చారు రాకేష్ తండ్రి.

1985లో సీ.ఏ., పూర్తి చేశాక, తండ్రిని ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయవచ్చా అని అడగటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇన్వెస్ట్ చేయడానికి కావలసిన డబ్బు తననే సంపాదించుకోమన్నారు. దీంతో రాకేష్ రూ.5వేలు ఇన్వెస్ట్ చేసారు. కానీ తక్కువ లాభాలు వచ్చాయి.

దీంతో ఇన్వెస్ట్ చేయ్యడానికి తన సోదరుడికి తెలిసిన వాళ్ల నుంచి రూ.2,50,000 అప్పుగా తీసుకున్నారు. 1986లో రూ.43తో 5వేల టాటా టీ షేర్లను కొన్నారు. మూడు నెలల్లో దాని ధర రూ.143కు చేరింది. దీంతో తనకు రూ.5లక్షల లాభం వచ్చింది. 1986 నుంచి 1989 వరకు రూ.25 లక్షలు సంపాదించారు.
 
ఓరోజు రాకేష్ తల్లి సలహాతో తన వద్ద ఉన్న షేర్స్ అమ్మి ఇల్లు కొన్నారు. కొన్ని సంవత్సరాలకు ఇంటి విలువ పెరిగింది. దాంతో పాటు తాను అమ్మిన షేర్ విలువ ఆకాశాన్ని అంటాయి. దీంతో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో..

మీకు ఏదైన కంపెనీ మీద నమ్మకం ఉంటే ఆ షేర్‌లను అమ్మకండి, అవి ఎప్పటికైన పెరుగుతాయంటూ సలహా ఇచ్చారు.

షేర్లను ఎప్పుడు కొనాలో, అమ్మాలో తెలియకుండా స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టద్దంటాడు రాకేష్. తన ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజితో ఎన్నో కోట్లు లాభాలందుకున్నాడు.

అందుకే తనను ఇండియన్ వారెన్ బఫెట్ అని అంటారు. అంతటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. 

Show More
Back to top button