Telugu News

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ స్కామ్స్

రోనా వల్ల బయటకు వెళ్లాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఇంట్లో నుంచి డబ్బు సంపాదించే మార్గాలు వెతకడం ప్రారంభించారు. ఇలాంటి వారికి డేటా ఎంట్రీ చక్కని ఉపాధి అవకాశం కల్పిస్తోంది. చాలా కంపెనీలు ఇంట్లో ఉంటూ డేటా ఎంట్రీ చేస్తే చాలు, నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చని మెసేజ్‌లు పంపుతున్నాయి. వీటిని చూసి ఆశపడి, సంప్రదిస్తే.. రూ.2000-5000 వరకు చార్జీలు చెల్లించాలని, పని పూర్తి అయ్యాక తిరిగి ఇస్తాం అని చెబుతారు. పని లభిస్తుంది, తర్వాత డబ్బు తిరిగి వస్తాయి కదా! అని వారు అడిగిన మొత్తం చెల్లిస్తాం. అక్కడే మనం పప్పులో కాలేస్తాం. మొదట్లో మీ పని బాగుందని చెప్పినా.. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు పంపిన డేటా మొత్తం తప్పుగా ఉందంటూ.. రావలసిన డబ్బు ఎగ్గొడతారు.

 ఒకవేళ అగ్రిమెంట్ రాయించుకుంటే.. దాని ప్రకారం కంపెనీ టైం వేస్ట్ చేసినందుకు మీపై లిగల్‌ యాక్షన్ తీసుకుంటామని భయపెట్టి, ఎదురు డబ్బు డిమాండ్ చేస్తారు. దీనికి భయపడి చాలా మంది డబ్బు చెల్లిస్తారు. కానీ మీకు ఇది తెలుసా? ఇదంతా ఒక స్కామ్, ఉద్యోగం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదువుకుంటాం. తర్వాత ఎన్నో ఇంటర్య్వూలకు వెళ్లి తెచ్చుకున్న ఉద్యోగంలోనే రానీ డబ్బు.. కేవలం ఇంట్లో నుంచి కాలి సమయంలో చేసిన పనికి వేల జీతం వస్తుందా? అనే విషయం ఒక సారి ఆలోచించండి. డబ్బులు సంపాదించాలనే ఆశతో మోసపూరిత కంపెనీలను నమ్మి మోసపోవద్దు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అత్యాశతో పోగొట్టుకోకండి. డబ్బు ఇతరులకు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. దీన్ని వీలైనంత వరకు మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి వాళ్లను ఈ ఉచ్చులో పడకుండా కాపాడండి. 

Show More
Back to top button