
కిడ్నీ సమస్యలున్నవారు నొప్పి మందులు (painkillers) తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. సాధారణ వ్యక్తులకైనా ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. ఎందుకంటే, ఈ మందులు నొప్పిని బ్లాక్ చేస్తాయి కానీ దానికి కారణమైన ముఖ్యమైన సమస్యను పరిష్కరించవు. ఉదాహరణకి మెడ కదిలించినప్పుడు నొప్పి వస్తే, అది కండరాల్లో తలెత్తిందా లేక కీలులో ఉందా అన్నది తెలుసుకోవాలి.
కండరాలు పట్టు tightly ఉన్నప్పుడు వాటిని విడిపించటానికి హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్, మృదువుగా మర్దన చేయడం (massage) ఉపయోగపడుతుంది. ఇంట్లో నయం కాకపోతే ఫిజియోథెరపీ అవసరం. జాయింట్‌లో సమస్య ఉంటే, అది మసిల్స్‌కూ ప్రభావం చూపుతుంది. అందుకే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడే చికిత్స చేయాలి.
అలాగే మెడ నొప్పి మళ్లీ రాకుండా ఉండేందుకు సరిగ్గా కూర్చోవడం, సరైన దిండు వాడటం, ఫిజియోథెరపీ ద్వారా ఎక్సర్సైజ్‌లు చేయడం అవసరం. నొప్పి తగ్గిన తర్వాత కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు చెయ్యడం అవసరం.