TRAVEL ATTRACTIONS

వేసవిలో బెస్ట్ టూర్ ప్లాన్ చేద్దామా..?

పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో చాలామంది చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తుంటారు. మీరు అందులో ఒకరైతే నైనిటాల్ ఉత్తమ ఎంపిక అని ప్రయాణికులు చెబుతున్నారు. ఎందుకు ఇది ఉత్తమ ఎంపిక..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రకృతి అందాలకు కొదవ లేదు. చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే వచ్చే ఆనందానికి అంతులేదు. నైనిటాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండే ప్రాంతం. అంటే ఇది ఒక కొండ ప్రాంతం. అందుకే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కొండల మీద నిలబడి చూస్తే మేఘాలు తాకుతున్న భావన కలుగుతుంది. మరిన్నీ విశేషాలు ఉన్న ప్రదేశానికి ఎవరు మాత్రం వెళ్లడానికి ఇష్టపడరు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎలా వెల్లవచ్చో ఇప్పుడు చూద్దాం. 

విమానంలో నైనిటాల్ చేరుకోవడానికి ముందుగా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి క్యాబులో నైనిటాల్ వెళ్లవచ్చు. మీరు రైలులో వెళ్లాలనుకున్నా.. ఇలాగే ముందు ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి నైనిటాల్ చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి నైనిటాల్ చేరుకోవడానికి బస్సులు అందుబాటులో లేవు. మీరు కావాలనుకుంటే సొంత వాహనంలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నైనిటాల్ దాదాపు 1,701.6 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడ మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే..

నైని లేక్

నైనిటాల్ జూ

మాల్ రోడ్డు

టిఫిన్ టాప్

వుడ్‌లాండ్ వాటర్‌ఫాల్

గరుడ్ తాల్

బింటల్ లేక్

కుర్పటాల్

స్నో వ్యూ పాయింట్

నైనిటాల్ టూర్ బడ్జెట్ ఎంత అవ్వొచ్చంటే..!

మీరు ఎంచుకునే రవాణా ప్రకారం మీ ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది.

ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.

వివిధ ఎంట్రీ టికెట్లకు దాదాపు రూ.2000 వరకు అవుతుంది.

నివసించడానికి రూంకు ఒక రోజుకు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చవుతుంది.

చివరగా అనుకోని ఖర్చు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, మరికొంత డబ్బు తీసుకెళ్లండి.

అన్ని ప్రదేశాలు కవర్ చేయాలనుకుంటే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. అది కూడా కేవలం అక్కడ తిరగడానికి. ఇది కాకుండా ప్రయాణ సమయం మీరు ఎంచుకున్న రవాణా మీద ఆధారపడి ఉంటుంది.

Show More
Back to top button