HEALTH & LIFESTYLE

యుక్త వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ లాభమా..?

చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని.. హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదని భావిస్తారు. కానీ, అది తప్పు. ఆరోగ్యం ఏ వయసులోనైనా క్షీణించవచ్చు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి వయసు వారికి అవసరం. దీనిని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

*వెయిటింగ్ పీరియడ్: హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకునే సమయంలో అప్పటికే మీకు ఏవైన అనారోగ్య సమస్యలు ఉంటే.. వాటికి చికిత్స పొందడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనినే వెయిటింగ్ పీరియడ్ అంటారు. చిన్న వయసులో ఎక్కువగా అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి చిన్న వయసులో బీమా తీసుకోవడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీ గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.

*తక్కువ ప్రీమియం: బీమాకు చెల్లించే ప్రీమియం వయసును బట్టి బీమా సంస్థ నిర్ధారిస్తుంది. అదే ప్రీమియం జీవితకాలం చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంత చిన్న వయసులో బీమా తీసుకుంటే, అంత తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. అంతేకాదు, ద్రవ్యోల్భణం వల్ల భవిష్యత్తులో బీమా పాలసీ ప్రీమియం ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి యుక్త వయసులోనే బీమా తీసుకోండి.

*పన్ను మినహాయింపు: సెక్షన్ 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్‌పై సంవత్సరానికి రూ.25 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, మీరు చిన్న వయసులోనే బీమా తీసుకున్నట్లైతే ఎక్కువ సంవత్సరాలు పన్ను మినహాయింపు పొందవచ్చు.

*నో క్లెయిం బోనస్: మీరు బీమా తీసుకున్న తర్వాత సంవత్సరమంతా క్లెయిం చేయకుండా ఉంటే.. పాలసీ సంస్థ వాళ్లు నో క్లెయిం బోనస్‌ను పాలసీదారులకు అందిస్తారు. దీనివల్ల ప్రీమియం తక్కువ అవుతుంది. మీరు యుక్త వయసులో బీమా తీసుకోవడం వల్ల పాలసీని ఎక్కువగా ఉపయోగించరు. దీనివల్ల మీ ప్రీమియం తగ్గుతుంది.

గమనిక: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అందులోని రైడర్లు చెక్ చేసుకుని అవసరం అయినవి తీసుకోండి. షరతులు సరిగ్గా చదివి సంతకం చేయండి.

Show More
Back to top button