Telugu Special Stories

అమ్మ ఆశయం కోసం IAS అయ్యాడు

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు  అందరూ జీవితంలో IAS, IPS కావాలనుకున్నవారే. కానీ అందరూ ఈ కలను సాకారం చేసుకోలేరు. కొంతమంది మాత్రమే ఇందులో విజయం సాధిస్తారు. అటువంటి వారిలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌ గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఒకరు. తన ఎనిమిదో ఏట ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సూర్య అమ్మ చనిపోయింది. IITలో చదువుతుండగా క్యాన్సర్‌తో నాన్ననూ కోల్పోయారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు బెంగళూరులోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు.

కలెక్టర్ అయితే ప్రజలకు ఈజీగా సేవ చేయొచ్చని తన తల్లి చెప్పగా.. ఆ ఆశయంతో కోసం ఐఏఎస్‌ కావాలనుకున్నారు. అయితే ఎడ్యుకేషన్‌ లోన్‌ తీర్చాల్సి ఉండటంతో ఉద్యోగం చేస్తూనే మొదటి రెండు సార్లు ఐఏఎస్‌కు సన్నద్ధమయ్యారు. రెండు ప్రయత్నాల్లో విఫలం కావడంతో.. మూడోసారి ఉద్యోగాన్ని వదిలి, మంచి కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో 64వ ర్యాంకును సాధించారు. ఇలా తన అమ్మ ఆశయాన్ని నెరవేర్చానని ప్రవీణ్ గర్వంగా చెబుతారు.
 
అభ్యర్థులకు ప్రవీణ్‌చంద్‌ సలహా..

ప్రిపరేషన్‌లో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని, వాటికి భయపడకుండా లక్ష్యసాధన కొరకే ముందుకు సాగిపోవాలని అభ్యర్థులు గుర్తించుకోవాలని ప్రవీణ్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థులకు ప్రిపరేషన్‌లో కొన్ని సమస్యలు వస్తాయని, కానీ చాలామంది సివిల్ సర్వెంట్స్ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారేనని మర్చిపోవద్దన్నారు. ‘ఈ ప్రయాణంలో వచ్చే ఫెయిల్యూర్స్ బాధతో ఒక్కోసారి లక్ష్యాన్ని వదిలి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ వాటి నుంచి పాఠాలను నేర్చి విజయ సాధనకు మెట్లుగా చేసుకోవాలి. మాక్ టెస్ట్‌లు రాయడం, రోజూ వార్తలు తెలుసుకోవడం, కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించడం, పాత ప్రశ్నాపత్రాలు విశ్లేషణ చేసి వాటికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం వంటివి చేస్తే విజయం మీ సొంతం అవుతుంది’ అని తెలిపారు.

Show More
Back to top button