
క్షయవ్యాధి ఇది మరణం వరకు దారి తీసే వ్యాధి. ముఖ్యంగా ఇది శరీరంలో ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇది చర్మం నుండి మెదడుకి కూడా సోకే అవకాశం కూడా ఉంది. క్షయవ్యాధిని టీబీ అని కూడా అంటారు. ఇది అసలు ఎలా వస్తుందంటే.. టిబీతో సోకిన రోగితో ఉన్నప్పుడు క్షయ వచ్చే అవకాశం ఉంది. టీబీ అనేది వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి త్వరగా వస్తుంది. అంటే హెచ్ఐవి పేషెంట్స్, డయాబెటిస్, క్యాన్సర్ పేషంట్స్, పోషకాహర లోపం ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. అయితే, ఈ వ్యాధి చిన్న పిల్లలకు రాకుండా ఉండడానికి ముందుగా BCG అనే టీకా ఇస్తే బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.
క్షయవ్యాధి లక్షణాలు..
*విపరీతంగా దగ్గు
*ఆకలి కాక పోవడం
*రాత్రి పూట జ్వరం
*చెమటలు రావడం
*రక్తం కక్కడం
*బరువు తగ్గడం
*ఊపిరి ఆడకపోవడం
క్షయ వ్యాధి రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మంచి పోషకాహారం తీసుకోవాలి. పన్నీర్, పాలు, మొలకలు, పప్పులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, వంటి ఆహారం తీసుకోవాలి.
ఎక్కువ ప్రోటీన్ ఉన్న డైట్ తినాలి.
మద్యపానం, సిగరెట్ అసలు తీసుకోవద్దు.
ఎక్కువగా పండ్లను తినడం బెటర్.
వైద్యుల సలహాలను తూచా తప్పకుండా పాటించాలి. సమయానికి ఔషధాలు తీసుకోవాలి.
క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే..
క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. కాబట్టి, ఎవరైనా తుమ్మినా, దగ్గినా వస్తుంది. కాబట్టి తప్పకుండా మాస్క్ పెట్టుకోండి.
టీబీ వచ్చిన వారికి దూరంగా ఉండండి.
టీపీ సోకిన వ్యక్తి ఎంగిలి చేసిన పదార్థాలు తినకూడదు.
ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.
రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
సమయానికి సరైన ఆహారం తినాలి. అలాగే సమయానికి నిద్రపోవాలి.
బయటి ఆహారం తగ్గించుకోవాలి.