
జార్జి రెడ్డి విప్లవానికి మారుపేరు. యువత దృష్టిలో ఎప్పటికీ ఆరని కాగడ ఆయన. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో విప్లవ జ్యోతిని వెలిగించిన అరుణతార. “జీనా హై తో మరణాసికో కదం కదం మే లాడాన సికో” అంటూ విద్యార్థుల్లో విప్లవ కాంక్షలు రగిలించిన క్రాంతి ధార. మతోన్మాద ఫ్యూడల్ శక్తుల అరాచకాలకు బలై ఐదు దశాబ్దాలు అవుతున్న జార్జిరెడ్డి రగిలించిన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది అంటే అతని విప్లవ నినాదం ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇన్నాళ్లు పుస్తకాలు పేపర్ కటింగ్ కే పరిమితమైన జార్జి రెడ్డి చరిత్ర ఇప్పుడు సినిమా కథా వస్తువుగా మారింది. దాంతో జార్జిరెడ్డి జీవిత విశేషాలు తెలుసుకోవాలని ఆత్రుత చాలా మందికి పెరిగింది. చరిత్ర మరిచిన విప్లవ యోధుడతను.
జాజిరెడ్డి అంటే పేరు కాదు ప్రవహించే ఉత్తేజం. ఊరకలెత్తే ఉత్సాహం. ఐదు అడుగుల ఆరు అంగుళాల కటౌట్ జార్జిరెడ్డి. ఆయనను ఢీకొట్టేందుకు కండలు తిరిగిన వారు సైతం భయపడేవారు వ్అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎదురుగా మృత్యువు నిలుచున్న చివరి శ్వాస వరకు పోరాడే అతని నైజం ముందు శత్రువులు బిక్కచచ్చిపోయేవారు. మతోన్మాద శక్తులకు ఫ్యూడల్ శక్తులకు సింహ స్వప్నమతను. అందుకేనేమో ఒంటరిని చేసి 32 మంది ప్రొఫెషనల్ గుండాలు చుట్టుముట్టి 60 కి పైగా కత్తిపోట్లతో కసితీరా పొడిచారు. ప్రాణాలు వదిలాడు అని తెలిసిన తరువాతే కత్తిపోట్లు ఆగాయి అంటే జార్జి రెడ్డి భయం ప్రత్యర్థులను ఎంత ఒణికించిందో అర్థం చేసుకోవచ్చు.
1972 ఏప్రిల్ 14 విద్యార్థి ఎన్నికలతో ఉస్మానియా రణరంగంగా మారిన రోజు. ఆంధ్ర, తెలంగాణలోని అన్ని వర్సిటీల్లో లాగే ఉస్మానియా యూనివర్సిటీలోనూ విద్యార్థి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఒక్క ఉస్మానియాలో మాత్రమే పరిస్థితి నివురు కప్పిన నిప్పులా మారింది. కాలమే స్తంభించింది ఏమో అన్నంత నిశ్శబ్దం. ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్న బండ క్యాంటీన్ జార్జిరెడ్డికి అతని స్నేహితులకు అడ్డా. జాతీయ అంతర్జాతీయ సమస్యలతో పాటు పిచ్చపాటి కబుర్లు ఎన్నో చెప్పుకునే అడ్డా అది. అలాంటి ప్లేస్ కు జార్జిరెడ్డి సన్నిహితులు రామచంద్రారెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓయూ ఎన్నికల్లో జార్జిరెడ్డి ప్యానెల్ నుంచి జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన వ్యక్తి రామచంద్రారెడ్డి. జార్జి రెడ్డి ప్యానెల్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ తరఫున లకం సింగ్ ప్యానెల్ పోటీ చేసింది. జెండా కాదు కదా కనీసం ఎజెండా కూడా చెప్పుకోలేని విద్యార్థి సంఘాలకు జార్జి రెడ్డి ఎంట్రీ తో వెయ్యేనుగుల బలం వచ్చింది. మతోన్మాద వ్యవస్థలకు వె
ఎదురు తిరిగిన జార్జిరెడ్డి తెగింపు ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. దాంతో చాలా యూనివర్సిటీలో ఏబీవీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ప్రోగ్రెసివ్ యూనియన్ డెమొక్రటిక్ పేరుతో స్థాపించిన సంస్థ ఏబీవీపీ కి చుక్కలు చూపించింది. దాంతో ఓయూ ఎన్నికలు ఏబీవీపీకి పిడిఎస్యుకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మరుసటి రోజు జరగాల్సిన ఎన్నికల్లో జార్జిరెడ్డికి విజయం అన్నంతగా మూడ్ క్రియేట్ అయింది. సరిగా అదే పరిస్థితిని క్యాచ్ చేసుకుంది జార్జిరెడ్డి వ్యతిరేక వర్గం. అప్పటికే ఐదారుసార్లు జార్జి రెడ్డిని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ జార్జి సంకల్పం ముందు అవన్నీ వర్కౌట్ కాలేదు. కానీ 1972 ఏప్రిల్ 14 జార్జిని చరిత్రలో కలిపేసేందుకు అతన్ని అంతం చేసేందుకు ప్యత్యర్ధి వర్గం పూనుకుంది. జార్జి రెడ్డి సన్నిహితుడైన రామచంద్ర రెడ్డి.. ప్రచారం చేసుకోనివ్వట్లేదని బండా క్యాంటీన్ కు పరుగున వచ్చి చెప్పడంతో జార్జిరెడ్డి ముందు వెనక ఆలోచించకుండా ఒంటరిగా బయలుదేరాడు. అదే అదునుగా భావించిన లక్కన్ సింగ్ వర్గం అతన్ని కసి తీరా అంతమందించింది. దాంతో ఉస్మానియా రణరంగం అయింది.
జార్జి రెడ్డి 1947 జనవరి 15న కేరళలోని మలబార్ జిల్లా పాల్కడ్ లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి చెల్లా రఘునాధ రెడ్డి. తల్లి లీలా వర్గీస్. డాన్ రెడ్డి, కార్ల్ రెడ్డి, కుమార్తె జాయ్ రెడ్డి, జార్జి రెడ్డి, చివారివాడు సిరీల్ రెడ్డి వీరికి సంతానం. చిన్నతనంలో ఇంట్రో వర్క్ అయినా జార్జి రెడ్డి మనుషుల కన్నా ప్రకృతి తోనే ఎక్కువ గడిపేవాడు. గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ అందాలు అతన్ని మరో లోకంలోకి తీసుకెళ్లేవి. తెలివైనవాడు చురుకైనవాడు కావడంతో ఎక్కువగా పుస్తకాల జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే వాటినే సమకాలీన సమాజంతో లింక్ చేసి చూసాడు. అందుకనే అతన్ని యూనివర్సిటీలో ఫిజిక్స్ టాపర్ గా గోల్డ్ మెడలిస్ట్ గా చేసింది. భౌతిక శాస్త్రం చాలామంది విద్యార్థులకు ఓ టఫ్ సబ్జెక్టు. కానీ జార్జి రెడ్డికి ఆ సబ్జెక్ట్ అంటే ఓ సరదా. దాంతో ఆటాడుకునేవాడు. పాతికేళ్ల వయసులో చనిపోకపోయి ఉంటే మరికొన్ని ఏళ్ళు బతికి ఉంటే ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ కొట్టే వారంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐన్ స్త్రీన్ తెలివి, చేగువేరా తెగువ కలగలిసిన అరుదైన వ్యక్తి జార్జి రెడ్డి. చదువుల్లో రాణిస్తూనే ఆటల్లోనూ రాటు తేలాడు జార్జి. కిక్ బాక్సింగ్ లేక్ ఫైటర్ గా అతనికి గుర్తింపు ఉంది.
బాక్సింగ్ లో డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాడు. బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు గంటలకొద్దీ జిమ్ లో వర్కౌట్స్ చేసేవాడు. ఆత్మ రక్షణ కోసం ఎప్పుడు ఆరంగులాల కత్తిని వెంటపెట్టుకొని తిరిగేవాడు. 1967 లో ఫిజిక్స్ లో పీహెచ్డీ చేసేందుకు ఉస్మానియా క్యాంపస్ కు వచ్చిన జార్జి రెడ్డికి ఆనాటి క్యాంపస్ పరిస్థితులు మింగుడు పడలేదు. అక్కడి నుంచి జార్జి జీవితం మలుపులు తిరిగింది. తనకున్న అపార జ్ఞానంతో ప్రొఫెసర్లకు చెమటలు పట్టించే వాడట. ప్రొఫెసర్లకే పాటలు చెప్పేంత తెలివైనవాడు అంటారు జార్జి గురించి తెలిసిన సన్నిహితులు. ఓసారి యూనివర్సిటీలో జరిగిన ఓ ఘటనతో జార్జిరెడ్డిని ఏడాది పాటు రెస్టిగేట్ చేశారట. ఆ ఏడాది కాలాన్ని లైబ్రరీలో వందల కొద్ది బుక్స్ చదివేలా చేశాయి. తనకి ఇష్టమైన మ్యాథ్స్ ఫిజిక్స్ పై ఎక్కువ స్టడీ చేశారు. వాటితో పాటు అంతర్జాతీయంగా ప్రభావితం చేస్తున్న అంశాల పైన అధ్యయనం చేశాడు.
ప్రపంచ విప్లవకారుడు చేగువేరా జార్జిని విపరీతంగా ఆకర్షించాడు. చే రాసిన గెరిల్లా వార్ అండ్ రెవల్యూషన్ డైరీ లాంటి గ్రంథాలు జార్జిని విపరీతంగా ప్రభావితం చేశాయి. మార్కిజం కోణంలో చుట్టూ ఉన్న సమాజాన్ని విశ్లేషించుకున్నాడు. సామ్యవాద ముసుగులో ప్రభుత్వాలు సాగిస్తున్న దోపిడీని అర్థం చేసుకున్నాడు. సామాజిక సమస్యలను విశ్లేషించుకుంటూనే తన చదువును కొనసాగించాడు. పేదోన్ని కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వాల ద్వంద నీతిని అర్థం చేసుకున్న జార్జి తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు. పేదల పక్షాన పోరాటానికి రెడీ అయ్యాడు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉండాలని తలచాడు. అప్పటివరకు ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకొని జార్జ్ అజ్ఞాతవాసం లాంటి రెస్టిగేషన్ ముగిసిన తర్వాత జరిగిన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో టాపర్ గా నిలిచి ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. జార్జ్ ఆన్సర్స్ పేపర్స్ దిద్దిన బాంబే ప్రొఫెసర్ అతని రాతలకు ముచ్చట పడ్డాడట.
సూటిగా సుత్తి లేకుండా ఫార్ములాస్ ని ప్రయోగించిన తీరు ఆ ప్రొఫెసర్ ముగ్దున్ని చేసింది. దాంతో జార్జిని వెతుక్కుంటూ వచ్చాడు ఆ ప్రొఫెసర్. అతన్ని కలిసి వెళ్లే టైంలో ప్రపంచం గర్వించే నేత ఓయూలో ఉన్నాడు అని వీసీకి చెప్పి వెళ్లాడట. ఓ వైపు జార్జ్ యూనివర్సిటీ చదువులు సాగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం మొదలైంది. శ్రీకాకుళం రైతాంగ పోరాటం, నక్సల్ భరీ ఉద్యమం, వియత్నం ఉద్యమం ఇలా ఎన్నో ఉద్యమాలు జార్జిని ఆలోచన లోకి తీసుకువెళ్లాయి. అప్పటికే ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న జార్జ్ జాతీయ అంతర్జాతీయ ప్రభావితం చేస్తున్న అంశాలను చూసి చలించిపోయాడు. చదువు పోరాటాల అన్న మానసిక సంఘర్షణతో సతమతమయ్యాడు చివరికి అప్పటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రుని ప్రోత్సాహంతో మార్క్ లిస్ట్ బాధ్యతను స్వీకరించాడు.
భావజాలంతోనే కాదు ఎప్పుడైతే విప్లవాన్ని తీసుకున్నాడో చెగువేరా తెగువను ఆవహించుకున్నాడు. అప్పుడే తనను తాను ఆదర్శ నాయకుడిగా మలుచుకునేందుకు రెడీ అయ్యాడు. స్లిప్పర్స్ ధరించేవాడు. పేదలకు సంఘీభావంగా ఒక పూట మాత్రమే తినేవాడు. ఎక్కువగా సిటీ బస్సుల్లో తిరిగేవాడు. అడిగిన వారికి అడగని వారికి చేతనైన సాయం చేసేవాడు. తన స్కాలర్షిప్ డబ్బులతో స్నేహితులతో వ్యాపారం పెట్టించిన మానవతావాది జార్జ్. తన చుట్టూ ఉన్న స్నేహితులను తనలాగే ప్రభావితం చేశాడు. తన ప్రగతిశీల భావాలతో తనతో కలిసి వచ్చిన సన్నిహితులతో కలిసి పిడిఎస్యు పేరుతో యూనియన్ ఏర్పాటు చేశాడు. విద్యార్థులతో సాంఘిక స్పృహ ప్రగతిశీల రగిలించేందుకు కృషి చేశాడు.
సామాజిక మార్పులకు సంబంధించిన చర్చలకు పెద్ద ఎత్తున జరిగే భౌతిక వాద శాస్త్రం, దేశంలో పేదరికం, ప్రజల విముక్తి పోరాటాల గురించి స్పీచ్ లు ఇస్తుంటే ఒక్కొక్కరు ముగ్ధులయ్యేవారు. అసలు జార్జ్ నడిచి వస్తుంటే గ్రంథం ఎదురొస్తున్నట్టు అనేవారు. 1970లో భూస్వామ్య వర్గాలు యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాయి. ఫలితంగా ఓయూలో అరాచక పాలన అప్పట్లో యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణం ఉండేది. ఆనాటి ఫ్యూడల్ శక్తుల వారసులు చక్రం తిప్పేవారు. అమ్మాయిలని ఈవ్ టీజింగ్ చేయడం లేదా గ్రామీణ విద్యార్థులను వేధించడం, హింసించడం, ఆ వర్గం నైజం. కుల ధూహంకారం దళితులకు, అమ్మాయిలకు చదువు ఎందుకని మానసికంగా వేధించేవారు. అన్యానికి గురైన విద్యార్థులకు జార్జ్ అండగా నిలిచేవారు. వాళ్లలో ధైర్యం నింపేవారు. మీరు చదువుకోవడానికి వచ్చారు. భయపడడానికి కాదు జీనా హై తో మరణాసికో. .
అన్న నినాదం అప్పుడే పుట్టింది ఆ తర్వాత క్యాంపస్ దాటి తన పిడిఎఎస్యూ కార్యకలాపాలను సిటీ మొత్తం విస్తరించాడు జార్జ్. పేదల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తేలేవాడు. దాంతో జార్జ్ పై భౌతిక దాడులు మొదలయ్యాయి. 1972 ఫిబ్రవరి 7న చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. సన్నిహితులు ఒంటరిగా తిరగవద్దని సలహా ఇచ్చిన లెక్క చేయలేదు. తన దాకా చావు రాదని అందరికీ ధైర్యం చెప్పేవాడు. అప్పటిదాకా క్యాంపస్ కు మాత్రమే హీరో అయినా జార్జ్ హైదరాబాద్ మొత్తానికి తెలిసాడు. అతని కంట్రోల్ చేయకపోతే భారత రాజకీయాలనే మార్చేస్తాడేమో అన్న నాటి పాలక వ్యవస్థ భూస్వామ్య వర్గం ఆలోచించింది. 1972 ఏప్రిల్ 14 దురాగతంగా చంపబడ్డాడు. ఈ హత్యలో జార్జ్ నమ్మకస్తుడు రామచంద్రారెడ్డి పావులా మారాడు. జార్జిరెడ్డి మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్య పాత్రధారులు సూత్రధారులైన చాలామంది శిక్ష నుంచి తప్పించుకున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీ మెట్లు జార్జిరెడ్డి రక్తంతో తడిసిన పోలీసులు సాక్షాన్ని చూపించలేకపోయారు. ప్రత్యక్ష సాక్షుల వాదనను ప్రాసిక్యూషన్ పట్టించుకోలేదు. దాంతో కోర్టు జార్జ్ హత్య కేసును కొట్టేసింది. అలా జార్జి రెడ్డి జీవితం ముగిసింది. కానీ ఐదు దశాబ్దాలుగా జార్జి రెడ్డి చూపించిన తెగువ, పోరాటం, విద్యార్థులకే కాదు ఉద్యమకారులకు ప్రజా సంఘాలకు కొత్త దారి చూపించింది. ఆనాడు జార్జ్ ఉస్మానియాలో తెగువ చూపించకపోతే క్యాంపస్ పరిస్థితి మరోలా ఉండేది అంటారు చరిత్రకారులు. ఉస్మానియాలో ప్రజాస్వాముల శక్తుల స్థానంలో మతోన్మాద శక్తులు చెలరేగేవి అంటారు. జార్జి రెడ్డి బతికుంటే ఫిజిక్స్ లో నోబెల్ కొట్టేవాడు అంటారు. కానీ తను నమ్మిన సిద్ధాంతాల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. మరో ప్రపంచం వేగుచుక్కయ్యాడు. తన అమరత్వంతో విప్లవాన్ని వెలిగించాడు.