TRAVEL

మైమరపించే మైసూర్  చూసొద్దామా..!

మైసూర్ వెళ్లడానికి ఎండాకాలం సరైన సమయంగా పర్యాటకులు చెబుతున్నారు. మరి మైసూర్ టూర్ ప్లాన్ చేద్దామా..? దీని కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మైసూరు వెళ్లడానికి రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 

*విమానం ద్వారా వెళ్లాలనుకుంటే హైదారాబాద్, తిరుపతి, విశాఖపట్నం నుంచి మైసూరుకు విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయాణానికి దాదాపు 2 నుంచి 5 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు టికెట్ ధరలు చెక్ చేసుకుని బుక్ చేసుకోండి.

*రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే కూడా హైదారాబాద్, తిరుపతి, విశాఖపట్నం నుంచి మైసూరుకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయాణం మీరు రాత్రి సమయంలో ప్రారంభిస్తే.. ఉదయం మైసూర్ చేరుకుంటారు.

*బస్సులో వెళ్లాలనుకుంటే ఒకరికి దాదాపు రూ.1300 నుంచి రూ.2500 వరకు ఖర్చు అవుతుంది. దీనికి దాదాపు 12 నుంచి 18 గంటల సమయం వరకు పడుతుంది.          

మైసూర్‌లో చూడవలసిన ప్రదేశాలు..!

ఎంతో అందమైన మైసూర్ ప్రదేశంలో తప్పకుండా చూడాల్సిన స్థలాలు బాగానే ఉన్నాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం..

*మైసూర్ ప్యాలెస్

*శ్రీ చమరజేంద్ర జూలాజికల్ గార్డెన్స్

*సోమనాథ్‌పుర ఆలయం

*నామ్‌డ్రొలింగ్ మొనాస్టరి

*శ్రీ చాముండేశ్వరి ఆలయం

*లోకరంజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ

*మెల్కోటే

*హిమదా గోపాలస్వామి ఆలయం

*మైసూర్ ఇసుక శిల్ప మ్యూజియం

*ఫిలోమెనా చర్చ్

*జగన్మోహన్ ప్యాలెస్

*శ్రీ నంది టెంపుల్

టూర్‌కు ఎంత ఖర్చు అవుతుంది..?

*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది. 

*రూమ్‌కు దాదాపు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది. 

*ఒకరికి భోజనానికి రోజుకు దాదాపు రూ.500 నుంచి రూ.700 వరకు అవుతుంది. 

*మైసుర్‌లో ప్రదేశాలను సందర్శించడానికి రోజుకు ప్రయాణ ఖర్చు దాదాపు రూ.400 నుంచి రూ.500 వరకు అవ్వొచ్చు.

*మీరు షాపింగ్ చేయాలనుకుంటే మరికొంత డబ్బు ఎక్కువగా తీసుకుని వెళ్లడం మంచిది. 

*వివిధ ఎంట్రీ టికెట్‌లకు దాదాపు రూ.1000 నుంచి రూ.2000 వరకు అవుతుంది.

Show More
Back to top button